నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక మళ్లీ వాయిదా

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మే 7న జరగాల్సిన ఉపఎన్నిక ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, లాక్ డౌన్ ఇప్పట్లో తొలగిపోయే పరిస్థితులు లేకపోవడంతో ఉపఎన్నికను మళ్లీ వాయిదా వేశారు. గతంలో పొడిగించిన గడువు ముగుస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి 45 రోజులకు పొడిగించింది. నిజామాబాద్ […]

కవిత విషయంలో కేసీఆర్ లెక్కేంటి ?

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కవిత నామినేషన్ వేశారు. ఆమె గెలుపు దాదాపు లాంఛనమే. దీంతో అసలు కవితను ఎమ్మెల్సీ చేయడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏమిటనే దానిపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కవితకు ఎమ్మెల్సీ పదవి ఖాయం కావడంతో…అందరి ఆలోచన ఆమెకు […]

నిజామాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. రైతుల కళ్ల ముందే బుగ్గిపాలైన పసుపు..

పంట చేతికొచ్చింది.. అమ్ముకుంటే పైసలొస్తయని ఆశపడ్డరు ఆ రైతన్నలు.. మార్కెట్‌కు తీసుకుపోదమని పది మంది కలిసి ఓ లారీ మాట్లాడుకున్నరు.. పసుపు బస్తాలన్నీ లారీలో ఎక్కించిండ్రు.. లారీ బయల్దేరుతుంటే ఖుషీ అయ్యిర్రు.. కానీ, ఆ సంతోషం నిమిషాల్లోనే ఆవిరైంది. లారీ డీజిల్ లీకై, మంటలు అంటుకొని పసుపంతా బుగ్గి […]

‘మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి’

నిజామాబాద్​లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్ రన్ పేరుతో 2కె రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ, అదనపు కలెక్టర్ లత పాల్గొని కార్యక్రమాన్ని పార్రంభించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి నిఖిల్ సాయి చౌరస్తా వరకు ఈ రన్ సాగింది. మహిళలు అన్ని […]

‘సూర్య నమస్కారాలు చేస్తే ఒత్తిడిని జయించవచ్చు’

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో ఆరోగ్య రక్ష సంస్థ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక బస్వా గార్డెన్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని.. 111 సూర్య నమస్కారాలు చేశారు. గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య […]

యువతిపై వారం రోజులు అత్యాచారం… నిజామాబాద్ జిల్లాలో దారుణం

నిజామాబాద్ జిల్లాలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామానికి చెందిన ఓ రాజకీయ నేత అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై కన్నేశాడు. కూతురి వయస్సుండే ఆమెను మభ్యపెట్టి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ఇటీవల సదరు యువతిని […]

పసుపు రైతులకు శుభవార్త…

నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయిచింది. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి కేంద్రం పెంచనుంది. ఐఏఎస్ హోదా డైరెక్టర్ స్థాయి అధికారితో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. ప్రాంతీయ […]

నిజామాబాద్‌లో హంగ్…

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 60 డివిజన్లు ఉన్న నగరంలో 24 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 18 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం రెండో స్థానంలో నిలవగా, టీఆర్ఎస్ […]

తస్మాత్‌ జాగ్రత్త..!

సాధారణంగా వర్షాకాలం రాగానే పొద్దున లేవగానే పల్లె ప్రజలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతారు. ఉదయం అనగానే చేన్లలోకి వెళ్లిన రైతులు చీకటి పడేదాక ఇంటి ముఖం చూడకుండా పంట పొలాల్లో పనులు చేస్తారు. పిల్లలు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తుంటారు. ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఎవరి పనికి వారు […]

ఇప్పటి వరకూ 15కు పైగా జడ్పీలను తన ఖాతాలో వేసుకున్న టీఆర్ఎస్!

జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకెళుతోంది. అసెంబ్లీ ఫలితాల జోరును పరిషత్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే టీఆర్ఎస్ 15కు పైగా జడ్పీ పీఠాలను తన ఖాతాలో వేసుకోనుంది. ఈసారి ఖమ్మంలో కూడా టీఆర్ఎస్ తన జోరును కొనసాగిస్తుండటం విశేషం. నిజామాబాద్, కరీంనగర్, […]