Monday, 02 December 2024 12:59:27 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

iPhone 16 Pro Series : భారీ బ్యాటరీతో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?

Date : 04 August 2024 03:56 PM Views : 85

Studio18 News - టెక్నాలజీ / : iPhone 16 Pro Series : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఐఫోన్ 16 సిరీస్ రాబోతోంది. భారత్ సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో సెప్టెంబర్‌లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఐఫోన్ రాకపై ఆన్‌లైన్‌లో ఇప్పటికే చాలా వివరాలు లీక్ కాగా, రాబోయే ఐఫోన్‌ల గురించి మరింత సమాచారం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. చైనీస్ వీబో ఆధారిత లీకర్ ఇన్‌స్టంట్ డిజిటల్ ఐఫోన్ 16 ప్రో 3,577 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని, ఐఫోన్ 16 ప్రో మాక్స్ 4,676 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని పేర్కొంది. ఇప్పటికీ ఆండ్రాయిడ్ ఫోన్‌లు అందిస్తున్న దానికంటే తక్కువగా ఉన్నప్పటికీ, 2024 ఐఫోన్‌లు ఐఓఎస్ డివైజ్‌ల్లో ఇప్పటివరకు అతిపెద్ద బ్యాటరీని ప్యాక్ చేయనున్నాయి. అలాగే, ఆపిల్ డివైజ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల కన్నా మెరుగ్గా ఉంటుంది. ఐఫోన్ 15ప్రో 3,274mAh బ్యాటరీని అందిస్తుంది. ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్ హుడ్ కింద 4,422mAh యూనిట్‌ను కలిగి ఉంది. మ్యాక్ రుమర్స్ ప్రకారం.. ఆపిల్ కొత్త ఫోన్‌లలో 6 నుంచి 9 శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచిందని సూచిస్తుంది. గత లీక్‌లను పరిశీలిస్తే.. : ఐఫోన్ 16 హుడ్ కింద పెద్ద 3,561mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే, ఐఫోన్ 16 ప్లస్ 4,006mAh యూనిట్‌ను కలిగి ఉంటుంది. గత లీక్‌లో ప్రో మోడల్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనప్పటికీ, ఐఫోన్ 16 ప్రో మాక్స్ పెద్ద 4,676mAh బ్యాటరీతో వస్తుందని నివేదించిందని లేటెస్ట్ లీక్ కూడా సూచిస్తుంది. నివేదిక ప్రకారం.. ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ 30-గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదు. ఐఫోన్ ప్రో మోడల్‌లు మెరుగైన శక్తి సాంద్రత, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోసం బ్యాటరీని అందిస్తాయి. ఈ ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించనుంది. కొత్త ఐఫోన్‌లు వేగవంతమైన 40డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 20డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో రావచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్టుతో రానుందని గత ఏడాదిలో కూడా ఇదే పుకారు వచ్చింది. ఐఫోన్ 15 సిరీస్‌తో రాలేదు. అందువల్ల, ఐఫోన్ 16 సిరీస్‌కు కూడా వస్తుందనే గ్యారెంటీ లేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :