Saturday, 07 March 2026 09:09:33 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్

తనలో భారత్ మూలాలు ఉండటం గర్వంగా ఉందని వ్యాఖ్య

Date : 01 April 2025 01:06 PM Views : 540

Studio18 News - టెక్నాలజీ / : దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇటీవలే భూమి మీద సురక్షితంగా అడుగుపెట్టారు. తాజాగా నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంతరిక్షంలో అనుభవాలను వీరు పంచుకున్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందనే ప్రశ్నకు సమాధానంగా చాలా అద్భుతంగా కనిపించిందని సునీత చెప్పారు. తాము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి... మంచు పర్వతాల అందాలను విల్మోర్ కెమెరాలో బంధించారని సునీత తెలిపారు. హిమాలయాలు అత్యద్భుతం అని చెప్పారు. గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీద నుంచి వెళుతున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు తమకు సిగ్నల్ మాదిరి పని చేసేవని అన్నారు. భారత్ కు వచ్చే అంశం గురించి సునీత మాట్లాడుతూ... తన తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. ఇండియాలో ఉన్న బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని... వారితో తన అనుభవాలను పంచుకోవాలని ఉందని అన్నారు. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. అంతరిక్ష రంగంలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న దేశమని కితాబునిచ్చారు. తనలో భారత్ మూలాలు ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.

#SunitaWilliams #NASA #Astronaut #IndiafromSpace #Himalayas #SpaceExploration

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :