Studio18 News - టెక్నాలజీ / : Vodafone Idea 5G Services : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం కంపెనీ వోడాఫోన్ ఐడియా (Vi) భారత మార్కెట్లో 5G సర్వీసులను ప్రారంభించింది. ముంబైలో వోడాఫోన్ ఐడియా 5G నెట్‌వర్క్ సర్వీసులను ప్రారంభించింది. ఆ తర్వాత బీహార్, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ వంటి ప్రాంతాల్లో 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
కంపెనీ 5G కనెక్టివిటీకి సంబంధించి అధికారక వెబ్‌సైట్లో మైక్రోసైట్‌ను కూడా క్రియేట్ చేసింది. అందులో ఇంటర్నెట్ సర్వీసును యాక్సెస్ చేసేందుకు వినియోగదారులు కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. వోడాఫోన్ ఐడియా అన్ని 5G ప్లాన్‌లతో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. ముంబైలో వోడాఫోన్ ఐడియా 5G సేవలు : వోడాఫోన్ ఐడియా వెబ్‌సైట్‌లోని కొత్త 5G మైక్రోసైట్‌లో “Vi 5Gతో ఫాస్టెస్ట్ కనెక్టివిటీ.. తదుపరి కమ్యూనికేషన్ యుగానికి స్వాగతం” అనే మెసేజ్‌తో ప్రవేశపెట్టింది. 5G కనెక్టివిటీ బెనిఫిట్స్ కూడా హైలైట్ చేస్తోంది. వినియోగదారులు తమ నెట్‌వర్క్ కవరేజీని చెక్ చేసేందుకు సర్కిల్‌ను ఎంచుకోవచ్చు. ప్రారంభంలో ముంబై సర్కిల్‌లో మాత్రమే యాక్టివ్ కవరేజ్ ఉంది. బీహార్, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ వంటి ఇతర సర్కిల్‌లకు ఏప్రిల్‌లో సర్వీసులు త్వరలో అందుబాటులోకి వస్తాయని వెబ్‌సైట్ పేర్కొంది. ప్రీపెయిడ్ ప్లాన్‌ల విషయానికి వస్తే.. : వోడాఫోన్ ఐడియా 5G ప్లాన్‌లు రూ. 299 నుంచి ప్రారంభమవుతాయి. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటాను అందిస్తుంది. కంపెనీ వరుసగా రోజుకు 1.5GB డేటా, 2GB డేటాను అదే వ్యాలిడిటీతో అందించే రూ. 349, రూ. 365 రీఛార్జ్ ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు రూ. 3,599 చెల్లించాలి. అంటే.. 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లన్నీ అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తాయి. పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం 4 ప్లాన్లు : పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం వోడాఫోన్ ఐడియా మొత్తం 4 ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. Vi Max 451, Vi Max 551 యూజర్లకు నెలకు రూ. 451, రూ. 551 రీఛార్జ్ చేసుకోవాలి. అయితే 50GB డేటాను పొందవచ్చు. ఆ తర్వాత ప్లాన్ 90GB డేటాతో వస్తుంది.
Vi Max 751 ధర రూ. 751 ఉండగా 150GB డేటాను అందిస్తుంది. చివరగా, REDX 1201 ధర రూ. 1,201 ఉండగా అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లన్నీ కవరేజ్ అందుబాటులో ఉన్న చోట అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తాయి. ప్రస్తుతం, వోడాఫోన్ ఐడియా అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. ప్రస్తుతం, భారత మార్కెట్లో రోజుకు 2GB కన్నా తక్కువ డేటాతో వచ్చే ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందించే ఏకైక టెలికాం ఆపరేటర్ ఇదే. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో రెండూ రోజుకు కనీసం 2GB డేటాను అందించే ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తున్నాయి.
Admin
Studio18 News