Studio18 News - టెక్నాలజీ / : హైదరాబాద్‌కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి అమెరికాలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో రూ. 3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా, తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో పదేళ్లపాటు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. సాయి దివేశ్ విద్యాభ్యాసం ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రమాదేవి పబ్లిక్ స్కూల్లోనే కొనసాగింది. ఇంటర్‌లో మెరుగైన స్కోరు సాధించి ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్‌ను అభ్యసించాడు. అక్కడే న్యూటానిక్స్ కంపెనీలో రూ. 40 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అనంతరం లాస్‌ఏంజిల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
Admin
Studio18 News