Studio18 News - టెక్నాలజీ / : WhatsApp Hack : వాట్సాప్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ వాట్సాప్ అకౌంట్ భద్రమేనా? ఏ క్షణమైనా హ్యాకర్లు మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేయొచ్చు. ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ హ్యాకింగ్ అనేది సర్వసాధారణంగా మారుతోంది. సైబర్ మోసగాళ్లు వాట్సాప్ అకౌంట్లను తమ కంట్రోల్లోకి తీసుకునేందుకు సోషల్ ఇంజనీరింగ్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. మీ అకౌంట్ సెక్యూర్ చేయడం, అనుమానాస్పద కాల్స్, మెసేజ్ పట్ల జాగ్రత్తగా ఉండటం, టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయడం ద్వారా మీ వాట్సాప్ అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీ వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు మీ వ్యక్తిగత డేటాను దొంగిలించేందుకు హ్యాకర్లు కొత్త మార్గా్లను ఎంచుకుంటున్నరు.
ఇటీవలే అనేక మంది వాట్సాప్ హ్యాకింగ్ సంఘటనలకు బలైపోయారు. వాట్సాప్ అకౌంట్లలో సెక్యూరిటీ లోపాలను బహిర్గతం చేస్తుంది. ఇంతకీ హ్యాకర్లు వాట్సాప్ అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తారు? ఇలాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా మీ వాట్సాప్ అకౌంట్లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వాట్సాప్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా హ్యాక్ చేస్తారంటే? : సైబర్ నేరగాళ్లు మీ వాట్సాప్ అకౌంట్లను హైజాక్ చేసేందుకు అనేక పద్ధతులను వాడుతుంటారు. కొన్ని సాధారణ పద్ధతులు ఉన్నాయి.. అవేంటో ఓసారి తెలుసుకోండి. OTP ఫిషింగ్ : స్కామర్లు వాట్సాప్ సపోర్టు టీంగా లేదా అధికారిగా నమ్మిస్తూ యూజర్లను 6 అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను షేర్ చేయమంటారు. సిమ్ స్వాపింగ్ : హ్యాకర్లు బాధితుడి నంబర్ కోసం డూప్లికేట్ సిమ్ కార్డును పొంది మీ వాట్సాప్‌ను హ్యాక్ చేస్తారు. వాట్సాప్ వెబ్ హైజాకింగ్ : హ్యాకర్లు యూజర్ ఫోన్‌కు బ్రీఫ్‌గా యాక్సెస్ చేస్తారు. వాట్సాప్‌ను వాట్సాప్ వెబ్‌కు లింక్ చేస్తారు. రిమోట్ యాక్సెస్ చేస్తారు. కాల్ మెర్జింగ్ స్కామ్ : స్కామర్ మిమ్మల్ని కాల్‌ను మెర్జ్ చేయమంటారు. తెలియకుండానే మిమ్మల్ని ఆటోమేటెడ్ వాట్సాప్ ఓటీపీ వెరిఫికేషన్ కాల్‌కి కనెక్ట్ చేస్తాడు. స్కామర్ OTP విని మీ అకౌంట్ కంట్రోల్ చేస్తాడు. మీ వాట్సాప్ అకౌంట్‌ను హ్యాకర్ల నుంచి ఎలా ప్రొటెక్ట్ చేయాలి? : టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA)ని ఎనేబుల్ చేయండి : మీ అకౌంట్ సేఫ్ కోసం అదనంగా సెక్యూరిటీ పిన్ సెటప్ చేయండి. OTP షేర్ చేయొద్దు : వాట్సాప్ మీ వెరిఫికేషన్ కోడ్‌ను ఎప్పటికీ అడగదు. ఎవరితోనూ ఓటీపీలను షేర్ చేయొద్దు. కాల్ ఫార్వార్డింగ్ ఆఫ్ చేయండి : కాల్ ఫార్వార్డింగ్‌ను నిలిపివేసేందుకు మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. వాట్సాప్ వెబ్ సెషన్‌లను చెక్ చేయండి : క్రమం తప్పకుండా వాట్సాప్ Settings > Linked Devices వెళ్లి గుర్తుతెలియని డివైజ్‌ల నుంచి లాగ్ అవుట్ అవ్వండి.
Admin
Studio18 News