Studio18 News - టెక్నాలజీ / : Lenovo Idea Tab Pro Launch : కొత్త ట్యాబ్ కొంటున్నారా? అయితే, భారత మార్కెట్లోకి లెనోవా లెనోవా ఐడియా ట్యాబ్ ప్రో వచ్చేసింది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ 12GB వరకు ర్యామ్, మీడియాటెక్ డైమన్షిటీ 8300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 10,200mAh బ్యాటరీని అందిస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్టుతో క్వాడ్ JBL స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంది. లెనోవా ట్యాబ్ పెన్ ప్లస్‌తో వస్తుంది. కీబోర్డ్ కనెక్టివిటీకి పోగో-పిన్ కనెక్టర్‌లను కలిగి ఉంది. టాబ్లెట్ లెనోవా స్మార్ట్ కంట్రోల్‌కు సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లు, పీసీలను కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది.
Admin
Studio18 News