Studio18 News - టెక్నాలజీ / : మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు. మరోమారు (మూడేళ్లలో మూడోసారి) భారత్ పర్యటనకు వస్తున్నట్లు బిల్ గేట్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన లింక్డ్ ఇన్ ఖాతా ద్వారా వెల్లడించారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేస్తోందన్నారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా .. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంపై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన పురోగతి సాధిస్తోందని ఆయన కొనియాడారు. భారత్ చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలను, పోలియో నిర్మూలనను ప్రశంసించారు. హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న ఆవాహన్ వంటి కార్యక్రమాలను ఆయన కొనియాడారు.
Admin
Studio18 News