Sunday, 08 March 2026 11:00:46 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Yamaha FZ-S Fi : వారెవ్వా.. సూపర్ బైక్.. యమహా FZ-S Fi హైబ్రిడ్ అదుర్స్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలుసా?

Yamaha FZ-S Fi : యమహా భారత మార్కెట్లో FZ-S Fi హైబ్రిడ్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైకు ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి..

Date : 12 March 2025 01:12 PM Views : 241

Studio18 News - టెక్నాలజీ / : Yamaha FZ-S Fi Launch : యమహా లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి సరికొత్త యమహా బైక్ వచ్చేసింది. ఇండియా యమహా మోటార్ (IYM) FZ-S Fi హైబ్రిడ్‌ను లాంచ్ చేసింది. ఈ బైకు రూ.1,44,800 (ఎక్స్-షోరూమ్) ధరతో వచ్చింది. దేశంలో యమహా మొట్టమొదటి హైబ్రిడ్ మోటార్‌సైకిల్ నాన్-హైబ్రిడ్ (FZ-S Fi) వేరియంట్ కన్నా రూ.10వేల ప్రీమియంను కలిగి ఉంది.

యమహా FZ-S Fi బైకులో 149-CC బ్లూ కోర్ ఇంజిన్ ఉంది. OBD-2Bకి సపోర్టు చేస్తుంది. ఈ ఇంజిన్ యమహా స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG), స్టాప్, స్టార్ట్ సిస్టమ్ (SSS)లతో అమర్చి ఉంది. ఈ టెక్నాలజీలతో బ్యాటరీ-అసిస్టెడ్ యాక్సలరేషన్ ఇంజిన్‌ను ఆటోమాటిక్‌గా ఆగిపోయేలా చేస్తుంది. తద్వారా క్లచ్‌తో ఇంజిన్ రీస్టార్ట్ చేయొచ్చు. డిజైన్ చాలావరకు ఒకేలా ఉంటుంది. కీలకమైన డిజైన్ అప్‌డేట్‌ ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి. ఎయిర్ ఇన్‌టేక్ ఏరియాలో అమర్చారు. కొత్త FZ-S Fi హైబ్రిడ్ 4.2-అంగుళాల ఫుల్ కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ ఫోన్లతో కనెక్టింగ్ యాప్ : Y-కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లతో ఇంటిగ్రేట్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్ లింక్ చేసిన టర్న్-బై-టర్న్ (TBT) నావిగేషన్‌ను కలిగి ఉంది. రియల్-టైమ్ డైరెక్షన్స్, నావిగేషన్ ఇండెక్స్, ఇంటర్ సెక్షన్ డిటైల్స్, రహదారి పేర్లను కూడా సూచిస్తుంది. లాంగ్ రైడ్స్‌ చేసే రైడర్ల కోసం హ్యాండిల్‌బార్ పొజిషన్‌ కూడా ఆప్టిమైజ్ చేసినట్లు యమహా తెలిపింది. యాక్సెసిబిలిటీ కోసం హ్యాండిల్‌బార్‌లోని స్విచ్‌లు అడ్జెస్ట్ చేసింది. రైడర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా హార్న్ స్విచ్‌ను అమర్చారు. ఫ్యూయల్ ట్యాంక్ ఇప్పుడు ఎరోప్లేన్ స్టయిల్ ఫ్యూయల్ క్యాప్ కలిగి ఉంది. ఫ్యూయల్ నింపేటప్పుడు వీలుగా ఉండేలా లింక్ చేసి ఉంటుంది. కొత్త 2025 FZ-S Fi హైబ్రిడ్ రేసింగ్ బ్లూ, సియాన్ మెటాలిక్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :