Studio18 News - టెక్నాలజీ / : Google Pixel 9a Launch : గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. బహుశా మార్చి 19న లాంచ్ అవుతుందని పుకార్లు వస్తున్నాయి. కానీ, గూగుల్ ఇంకా ఈ పిక్సెల్ ఫోన్ రాకపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒక యూట్యూబర్ అధికారిక ఛానెల్‌లో హ్యాండ్-ఆన్ వీడియోను పోస్టు చేయడంతో కొత్త లీక్ వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఫోన్ డిజైన్, కెమెరాలను సూచిస్తుంది. ఈ లీక్ గత పుకార్లకు దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.
పిక్సెల్ 9a హ్యాండ్-ఆన్ వీడియో లీక్ : గూగుల్ పిక్సెల్ 9a లీక్‌లను యూట్యూబర్ అలెక్సిస్ గార్జా షేర్ చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోను డిలీట్ చేశాడు. రెజ్లింగ్ ఈవెంట్‌లో ఫోన్‌తో యూట్యూబ్ షార్ట్స్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో పిక్సెల్ 9a కెమెరా ఇంటర్‌ఫేస్‌ను సూచిస్తుంది. 0.5x, 1x, 2x జూమ్ ఆప్షన్లతో హై-స్పీడ్ మూవెంట్స్ క్యాప్చర్ చేయగలదు. లీకైన ఫుటేజ్ కూడా బ్లాక్ కలర్ వేరియంట్‌ను సూచిస్తుంది. ఈ కలర్ ‘అబ్సిడియన్’గా పిలుస్తారు. గూగుల్ ట్రెడేషనల్ నేమింగ్ స్కీమ్ ఆధారంగా రూపొందించింది. కెమెరా బార్ బ్యాక్ ప్యానెల్‌లో కలిసిపోయినట్లు కనిపిస్తుంది. గత మోడళ్లతో పోలిస్తే.. మరింత సూక్ష్మమైన డిజైన్‌ను అందిస్తుంది.
Admin
Studio18 News