Studio18 News - టెక్నాలజీ / : గత కొన్నేళ్లుగా ఆపిల్ తన న్యూ జనరేషన్ ఐఫోన్ మోడళ్ల విషయంలో పాత డిజైన్ విధానాన్నే ఫాలో అవుతోంది. స్టాండర్డ్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ డిజైన్‌లో అప్‌గ్రేడ్‌లు ఉన్నప్పటికీ.. ప్రో మోడల్స్‌లో మాత్రం పాత డిజైనే ఉంది. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో డిజైన్ మార్పులు చాలా ఉంటాయని ఇప్పటికే పలు రిపోర్టులు చెప్పాయి. యూజర్లు ఫ్రెష్ లుక్‌తో వీటిని అందుకోవచ్చని వాటి ద్వారా తెలుస్తోంది. తాజాగా, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ఎయిర్, వనిల్లా ఐఫోన్ 17 మోడళ్ల డమ్మీ యూనిట్లు ఓ కొత్త వీడియోలో కనపడ్డాయి. ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లతో పోల్చి చూస్తే డిజైన్‌లో అనేక మార్పులతో ఐఫోన్ 17 సిరీస్ వస్తున్నట్లు అర్థమవుతుంది.
Admin
Studio18 News