Sunday, 25 January 2026 05:33:31 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఈ నెలలో బెస్ట్ కెమెరా మొబైల్ ఫోన్లు మీకోసం..

కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఫొటోలు తీయడం మీ హాబీనా.. అయితే ఇది మీకోసమే.. భారత మార్కెట్లో 8 బెస్ట్ కెమెరా మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఓసారి లుక

Date : 08 March 2025 04:38 PM Views : 255

Studio18 News - టెక్నాలజీ / : కొత్త మొబైల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. చాలామంది వినియోగదారులు ఫీచర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఫీచర్లు బాగుంటే చాలు.. ఆ ఫోన్ ఎంతైనా కొనేస్తుంటారు. ప్రధానంగా కెమెరా ఫీచర్లకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే మార్కెట్లో కెమెరా ఫీచర్లు మంచిగా ఉన్నాయంటే కొనేందుకు కొంచెం కూడా వెనకాడరు. మీరు కూడా అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగిన హైఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుతం మార్కెట్లో మార్చిలో లభ్యమయ్యే రూ. 60వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా మొబైల్ ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని వెంటనే కొనేసుకోండి.

వన్‌ప్లస్ 13ఆర్ : అమెజాన్‌లో వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ ధర రూ. 42,988కి లభ్యమవుతుంది. ఇందులో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ఉన్నాయి. ఈ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫొటో లెన్స్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 16ఎంపీ సింగిల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. రియల్‌మి GT 7ప్రో​: అమెజాన్‌లో ఈ రియల్‌‌మి జీటీ 7 ప్రో ధర రూ. 54,999కు లభ్యమవుతుంది. రియల్‌మి జీటీ 7 ప్రోలో 6.78-అంగుళాల అమోల్డ్, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉన్నాయి. 50ఎంపీ బ్యాక్ ట్రిపుల్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 16ఎంపీ సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హైక్వాలిటీ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేసేందుకు బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఐక్యూఓ 13 : ఐక్యూ 13లో 6.82-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ. 54,998కు అందుబాటులో ఉంది. వైడ్ లెన్స్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపీ సెల్ఫీ కెమెరాను ఫోటోగ్రఫీ యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అందిస్తుంది. ఒప్పో రెనో 13 ప్రో : జియోమార్ట్‌లో ఈ ఒప్పో రెనో 13 ప్రో ఫోన్ రూ.54,999 ధరకు లభిస్తుంది. ఒప్పో ఫోన్ 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. 50ఎంపీ సింగిల్ సెల్ఫీ కెమెరా సెల్ఫీలతో క్లిక్ చేయడానికి చాలా బాగుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 : అమెజాన్‌లో రూ.50,600కి అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ S24 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 10ఎంపీ టెలిఫోటో లెన్స్, సెల్ఫీల విషయానికి వస్తే 12ఎంపీ సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్ కలిగి ఉంది. వివో వి40 ప్రో : వివో V40 ప్రోలో 6.78-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ఆఫ్ 9200 ప్లస్ ప్రాసెసర్, హై రిజల్యూషన్ ఫోటో, వీడియోల కోసం బ్యాక్, ఫ్రంట్ 50ఎంపీ వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. 80డబ్ల్యూ వరకు ఛార్జింగ్ పవర్‌కు సపోర్టు ఇచ్చే భారీ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,999కు అందుబాటులో ఉంది. గూగుల్ పిక్సెల్ 8A : గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ 6.1-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్‌తో 13ఎంపీ సింగిల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు అద్భుతమైన ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ ఫోన్ ధర రూ. 37,999కు అందుబాటులో ఉంది.

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్​: ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 49,999 ధరకు లభిస్తుంది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 6.9-అంగుళాల ఫోల్డబుల్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌ను అందిస్తుంది. ఇందులో 50ఎంపీ బ్యాక్ కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, వైడ్ లెన్స్‌తో 50ఎంపీ సింగిల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది. తద్వారా సెల్ఫీలు ఆకర్షణీయంగా క్యాప్చర్ చేయొచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :