Studio18 News - బిజినెస్ / : రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్, మొబైల్ యాప్ కుప్పకూలాయి. దీంతో టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఈ సమస్య మరింత తీవ్రమైంది. ‘మెయింటెన్స్’ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు పాపప్ మెసేజ్ వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. సమస్య పరిష్కారం కోసం తమ టెక్నికల్ టీం ప్రయత్నిస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని, ఫలితంగా ఈ-టికెటింగ్ వ్యవస్థ అందుబాటులో లేదని, కొంతసేపటి తర్వాత ప్రయత్నించాలని కోరింది. భారతీయ రైల్వే డిజిటల్ ప్లాట్‌ఫాం అయిన ఐఆర్‌సీటీసీ పలు మార్గాల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్, ఎస్సెమ్మెస్ ద్వారా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Also Read : సినిమా వాళ్లకు వీడియోలు చూపించిన పోలీసులు
Admin
Studio18 News