Monday, 17 March 2025 04:50:46 PM
# Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

అమెరికాలోని ఓ పట్టణంలో గోధుమ రంగు మంచు.. అధికారుల అలర్ట్

సరిగా పనిచేయని స్థానిక పేపర్ మిల్లు ‘బ్లాక్ లిక్కర్’ అనే వ్యర్థ పదార్థం కారణంగా మారిన రంగు తాకితే చర్మ సమస్యలు వస్తాయని అధికారుల హెచ్చరిక

Date : 17 December 2024 12:10 PM Views : 117

Studio18 News - టెక్నాలజీ / : మంచు తెల్లటి రంగులో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కానీ, అమెరికాలోని మైనే రాష్ట్రం రమ్‌ఫోర్ట్ పట్టణంలో అసాధారణ దృశ్యాలు కనిపించాయి. పట్టణంలోని ఓ ప్రాంతాన్ని గోధుమ వర్ణపు మంచు దుప్పటి కప్పేసింది. ఈ అసాధారణ వాతావరణాన్ని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో గోధుమ రంగు మంచు పేరుకుపోయిందని పట్టణ అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే, స్థానికంగా ఉన్న ఓ పేపర్ మిల్లు సరిగా పనిచేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. పేపర్‌ను ఉత్పత్తి చేసే ఈ కంపెనీ నుంచి వెలువడే ‘బ్లాక్ లిక్కర్‌’ అనే వ్యర్థ పదార్థమే ఇందుకు దారితీసిందని వివరించింది. కొన్ని నమూనాలు సేకరించి పరిశీలించగా పీహెచ్ స్థాయి 10 కంటే ఎక్కువ చూపించిందని తెలిపింది. ఈ మంచును తాకవద్దని స్థానికులను అధికారులు హెచ్చరించారు. ఈ మంచు విషపూరితమైనది కాకపోయినప్పటికీ పెంపుడు జంతువులు, పిల్లలు అందులో ఆడుకోకుండా చూసుకోవాలని సూచించారు. చర్మ సంబంధ సమస్యలు వస్తాయని అప్రమత్తం చేశారు. ఆ తర్వాత మైనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ పరీక్షలు నిర్వహించగా పీహెచ్ స్థాయి 8 కంటే తక్కువగా నమోదవడంతో ఆందోళన తగ్గింది. బుధవారం వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఈ మంచు కొట్టుకుపోయే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, గోధుమ రంగు మంచు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read : డొనాల్డ్ ట్రంప్ కు కోర్టులో చుక్కెదురు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :