Studio18 News - టెక్నాలజీ / : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఇస్రో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనుంది. డిసెంబర్ 4న పీఎస్ఎల్వీ సీ59, డిసెంబర్ 24న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్లను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. శ్రీహరికోట షార్ లోని ప్రయోగ వేదికకు సంబంధించిన మొబైల్ సర్వీస్ టవర్ లో పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ అనుసంధానం పనులు జరుగుతున్నాయి. పీఎస్ఎల్వీ ఇంటెగ్రేషన్ బిల్డింగ్ లో పీఎస్ఎల్వీ సీ60 అనుసంధానం పనులు కొనసాగుతున్నాయి. పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు. డిసెంబర్ 24న జరిగే పీఎస్ఎల్వీ సీ60 ద్వారా రిశాట్-1బీ అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నారు.
Also Read : యూఎస్ బుకింగ్స్‌లో 'పుష్ప-2' అరుదైన ఘనత.. విడుదలకు ముందే రికార్డుల మోత!
Admin
Studio18 News