Studio18 News - టెక్నాలజీ / : మనం బీచ్ అనగానే గోధమ రంగు ఇసుక, నీలం రంగులో కనిపించే సముద్రం మాత్రమే అనుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో విభిన్నమైన బీచ్ లు ఉన్నాయి. కేవలం గోధుమ రంగు ఇసుక కాకుండా... గులాబీ, ఎరుపు, ఆరెంజ్, నలుపు వంటి ఎన్నో రంగుల్లో అక్కడి ఇసుక ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన బీచ్ లు ఏమిటో చూద్దామా.. పింక్ శాండ్ బీచ్, ఇండోనేషియా ఈ బీచ్ లో ఐరన్ ఆక్సైడ్ ఖనిజం, మామూలు ఇసుక కలిసి.. లేత గులాబీ రంగులో ఇసుక కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి పర్యాటకులు విపరీతంగా వస్తుంటారు. .................................................................................................... పోర్టో ఫెర్రో బీచ్, ఇటలీ ఇటలీలోని సార్డినియాలో ఉన్న ఈ బీచ్ లో ఇసుక... ఆరెంజ్ లైమ్ స్టోన్ తో కలసి బంగారు రంగులో ఉంటుంది. ఇది ఆరెంజ్ రంగులోని సున్నపురాయి గనులు, సమీపంలోని అగ్ని పర్వత లావా శిలల వల్ల ఇక్కడి ఇసుక అలాంటి రంగులో ఏర్పడింది. ....................................................................................................... షెల్ బీచ్, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోని షార్క్ బే వద్ద ఉన్న షెల్ బీచ్ లో ఇసుక మరీ చిత్రం. ఆల్చిప్పల అతి చిన్న ముక్కలు అచ్చం ఇసుకలా అందులో కలసిపోయి ఉంటాయి. అందుకే దీన్ని షెల్ బీచ్ అంటుంటారు. .......................................................................................................... పపకోలియా బీచ్, హవాయి అమెరికాలోని హవాయి తీరంలోని పపకోలియా బీచ్ లో ఇసుక లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆలివైన్ గా పిలిచే ఖనిజం నుంచి ఏర్పడటంతో ఆ రంగు వచ్చిందని గుర్తించారు. ............................................................................................................ కావెండిష్ బీచ్, కెనడా కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవిలో ఉన్న ఈ బీచ్ లో ఇనుప ఖనిజం అధికంగా ఉన్న రాళ్ల నుంచి ఇసుక ఏర్పడింది. అందుకే ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని రెడ్ బీచ్ గా కూడా పిలుస్తారు. ............................................................................................................. ఫేఫర్ బీచ్, యూఎస్ఏ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఈ బీచ్ లో ఇసుక వంకాయ (పర్పుల్) రంగులో ఉంటుంది. ఇక్కడికి సమీపంలోని కొండల్లో ఉన్న మాంగనీస్ నిక్షేపాలకు సంబంధించిన రాళ్లతో ఈ రంగు ఏర్పడిందని తేల్చారు. .......................................................................................................... పునలులు బీచ్, యూఎస్ఏ అమెరికాలోని హవాయిలో ఉన్న ఈ బీచ్ లో ఇసుక పూర్తిగా నల్లటి రంగులో ఉంటుంది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా నుంచి ఇసుక ఏర్పడటంతో ఇలా నల్లటి రంగులో ఉందని గుర్తించారు. ........................................................................................................ హయామ్స్ బీచ్, ఆస్ట్రేలియా ఈ బీచ్ ప్రపంచంలోనే ప్రత్యేకం. ఇక్కడి ఇసుక పాలరాయిలా దాదాపు తెలుపు రంగులో ఉండి మెరిసిపోతుంది
Also Read : ఆ ప్రభుత్వం పిల్లల కోసం ఏం చేస్తుందనేది చూడాలి: నారా భువనేశ్వరి
Admin
Studio18 News