Studio18 News - బిజినెస్ / : నిన్న ఫ్లాట్ గా ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 820.97 పాయింట్ల నష్టంతో 78,675 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 257.85 పాయింట్ల నష్టంతో 23,883 వద్ద స్థిరపడింది. ఐటీ, రియాల్టీ సెక్టార్లు మినహా మిగిలిన అన్ని రంగాల్లో ఇన్వెసర్లు భారీగా అమ్మకాలకు తెరలేపడంతో స్టాక్ మార్కెట్ సూచీలు పతనమయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు డీలాపడ్డాయి. ఎన్టీపీసీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, మారుతి, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సెర్వ్, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలు మూటగట్టుకున్నాయి. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలు అందుకున్నాయి.
Also Read : ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఇదివరకే హెచ్చరించా: డీకే అరుణ
Admin
Studio18 News