Thursday, 14 November 2024 06:23:09 AM
# #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు.. # కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం.. # బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత # లక్నో బయల్దేరిన రామ్ చరణ్

Zomato: జొమాటో ఆర్డర్లు మరింత ప్రియం.. పండగ సీజన్ ముందు కీలక నిర్ణయం

Date : 24 October 2024 11:33 AM Views : 46

Studio18 News - బిజినెస్‌ / : ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’పై బుకింగ్స్ మరింత ప్రియం కానున్నాయి. ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10కి పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్లాట్‌ఫామ్ ఫీజును 60 శాతం మేర పెంచినట్టు అయింది. ఈ ప్రకటనతో ఫుడ్ ఆర్డర్ల రేట్లు మరింత పెరగనున్నాయి. ఈ ఏడాది జనవరిలో కూడా ప్లాట్‌ఫామ్ ఛార్జీలను జొమాటో పెంచింది. ఆ సమయంలో రూ.4 ఉండగా రూ.6కు హెచ్చించింది. తాజాగా రూ.6 నుంచి రూ.10కి పెంచింది. ఈ పెంపు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ధరను ప్రభావితం చేస్తుంది. ప్రతి ఆర్డర్‌పై రూ.10 ప్లాట్‌ఫామ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు‌ క్రమక్రమంగా పెరుగుతోంది. క్రమం తప్పకుండా అనేక సార్లు కంపెనీ పెంచింది. ఆరంభంలో రూ.1గా ఉండగా దానిని రూ.2కి, ఆపై రూ.3కి పెంచింది. 2023లో రూ.3 నుంచి రూ. 4కి పెంచింది. ఆ తర్వాత క్రమంగా రూ. 6కి పెరిగింది. దీపావళి నేపథ్యంలో పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు కంపెనీ తాజాగా రూ.10కి పెంచింది. పండగల సీజన్‌లో జొమాటో ఆర్డర్లకు సాధారణంగా డిమాండ్ అధికంగా ఉంటుంది. నిర్వహణ వ్యయాల కోసం ప్లాట్‌ఫామ్ ఫీజులను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని జొమాటో తెలిపింది. దీపావళి సందర్భంగా ఆర్డర్‌ల సంఖ్య పెరుగుతుందని, వినియోగదారులకు చక్కటి సేవలను అందించడానికి పెంచిన ఈ రుసుము సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. కాగా జొమాటో ప్రత్యర్థి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ కూడా ప్లాట్‌ఫారమ్ ఫీజు వసూలు చేస్తోంది. ప్రతి ఆర్డర్‌పై రూ.6.50 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :