Monday, 02 December 2024 12:58:58 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Samsung Galaxy A16 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ A16 5జీ ఫోన్ లాంచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతంటే?

Date : 18 October 2024 04:57 PM Views : 32

Studio18 News - టెక్నాలజీ / : Samsung Galaxy A16 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం.. ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎ16 5జీ ఫోన్ వచ్చేసింది. ఫ్రాన్స్‌లో లాంచ్ అయిన కొన్ని వారాల తర్వాత భారత మార్కెట్లో ఈ 5జీ ఫోన్ లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎ16 5జీ పేరుతో 6 జనరేషన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ఎస్ఓసీతో 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎ16 5జీ ధర ఎంతంటే? : శాంసంగ్ గెలాక్సీ ఎ16 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 18,999, అయితే, 8జీబీ+ 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 20,999కు పొందవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయిస్తుంది. యాక్సస్ బ్యాంకు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొత్త ఫోన్ కొనుగోలుపై రూ. వెయ్యి క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎ16 5జీ ఇప్పటికే ఫ్రాన్స్‌లో అమ్మకానికి ఉంది. సింగిల్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఈయూఆర్ 249 (దాదాపు రూ. 23వేలు) ధరను కలిగి ఉంది. ఈ ఫోన్ మొత్తం గ్రే, మిడ్‌నైట్ బ్లూ, టర్కోయిస్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ16 5జీ స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ ఎ16 5జీ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఆన్‌బోర్డ్ స్టోరేజీని 1టీబీ (మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా) వరకు విస్తరించవచ్చు. ఆరు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను స్వీకరించింది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. గెలాక్సీ ఎ16 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఫ్రంట్ సైడ్ 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. గెలాక్సీ ఎ16 5జీ గత మోడల్స్ 8.4ఎమ్ఎమ్ మందంతో పోలిస్తే.. 7.9ఎమ్ఎమ్ మందంగా ఉంది. ఐపీ54-సర్టిఫైడ్ బిల్డ్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఎన్ఎఫ్‌సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) ఆధారితమైన ట్యాప్ అండ్ పే ఫీచర్‌తో వస్తుంది. 25 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. గెలాక్సీ ఎ16 5జీలో బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 2.5 రోజుల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :