Studio18 News - టెక్నాలజీ / : JioBharat Phones : కొత్త ఫీచర్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి రెండు సరికొత్త ఫీచర్లు వచ్చేశాయి. జియోభారత్ సిరీస్ ఫోన్లలో జియోభారత్ (V3), జియోభారత్ (V4) అనే రెండు కొత్త మోడళ్లను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఫోన్‌ల ధర కేవలం రూ. 1,099 మాత్రమే. దేశంలోని మిలియన్ల మంది 2జీ యూజర్లకు సరసమైన 4జీ కనెక్టివిటీని అందిస్తుంది. జియోభారత్ V2 ఫోన్0కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చాయి. ఈ కొత్త మోడల్‌లను జియో డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ లక్ష్యంగా తీసుకొచ్చింది. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలో డిజిటల్ సర్వీసులకు యాక్సస్ అందిస్తుంది. ప్రతి భారతీయుడికి అత్యాధునిక సాంకేతికను అందుబాటులోకి తీసుకురావాలనే జియో లక్ష్యంగా పెట్టుకుంది . అందులో జియోభారత్ V3 ఫోన్ స్టైల్-సెంట్రిక్ ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో వస్తుంది. కేవలం యుటిలిటీ ఫోన్ కన్నా ఎక్కువనే చెప్పాలి. జియో V3 ఫ్యాషన్, ఫంక్షనల్ ఫోన్‌ను కోరుకునే భారతీయ యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరోవైపు, జియోభారత్ V4 మోడల్ మినిమలిస్టిక్ డిజైన్, క్వాలిటీని కలిగి ఉంది. ఎలివేటెడ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ రెండు మోడల్‌లు సరసమైన ధర వద్ద ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. ఈ రెండు ఫోన్‌లు జియో డిజిటల్ సర్వీసెస్ సూట్‌తో ప్రీలోడ్ అయ్యాయి. జియోటీవీ యూజర్లకు 455కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. తమకు ఇష్టమైన షోలు, వార్తలు, స్పోర్ట్స్ కంటెంట్ చూడవచ్చు. జియోసినిమాలో మూవీలు, వీడియోలు, స్పోర్ట్స్ కంటెంట్‌ని అందిస్తోంది. అలాగే, జియోపే, యూపీఐ ఇంటిగ్రేషన్, ఇంటర్నల్ సౌండ్ బాక్స్‌తో, డిజిటల్ పేమెంట్లు చేసుకోవచ్చు. జియోచాట్ కూడా యూజర్లకు అన్‌లిమిటెడ్ మెసేజింగ్, ఫొటో షేరింగ్, గ్రూప్ చాట్ ఆప్షన్లతో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. హార్డ్‌వేర్ పరంగా జియోభారత్ V3, జియోభారత్ V4 ఫోన్లు 1000mAh బ్యాటరీతో వస్తాయి. రోజంతా ఛార్జింగ్ వస్తుంది. 128జీబీ వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు కూడా. వినియోగదారులు తమ ఫొటోలు, వీడియోలు, యాప్‌లకు ఎక్కువ స్టోరేజీ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లు 23 భారతీయ భాషలకు కూడా సపోర్ట్ చేస్తాయి. దేశవ్యాప్తంగా విస్తృత శ్రేణి వినియోగదారులకు ఈ జియో ఫోన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. జియోభారత్ ఫోన్ల నెలవారీ రీఛార్జ్ ప్లాన్ రూ. 123 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌పై అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14జీబీ డేటా ఉన్నాయి. జియోభారత్ మోడల్ ఫోన్లు మీ బడ్జెట్‌కు అనుకూలమైనదిగా మాత్రమే కాదు.. పోటీదారులతో పోల్చితే.. 40శాతం ఆదా చేసుకోవచ్చు. జియోభారత్ V3, జియోభారత్ V4 ఫోన్లు త్వరలో ఫిజికల్ స్టోర్‌లలో, ఆన్‌లైన్‌లో జియోమార్ట్, అమెజాన్‌లో అందుబాటులోకి రానున్నాయి.
Admin
Studio18 News