Monday, 02 December 2024 02:06:22 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Moto G85 Sale : మోటో G85 ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? 4 కారణాలివే..!

Date : 14 October 2024 04:51 PM Views : 39

Studio18 News - టెక్నాలజీ / : Moto G85 Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ85పై అదిరే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్లతో రూ. 17,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. మోటోరోలా మోటో జీ85 ఎడ్జ్ సిరీస్‌కు సమానమైన ఫీచర్లను కలిగి ఉంది. కర్వడ్ డిస్‌ప్లే, తేలికపాటి డిజైన్, ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ కలిగి ఉంది. జీ-సిరీస్‌లో సోనీ లైటా 600 కెమెరా సెన్సార్‌తో వచ్చిన మొదటిది కూడా ఇదే. మోటో జీ85 ప్రత్యేకించి డిస్‌ప్లే, డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ85పై మరిన్ని తగ్గింపులను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ సందర్భంగా ఇ-కామర్స్ వెబ్‌సైట్ మోటో జీ85 ధర రూ.16,999కి విక్రయిస్తోంది. అదనంగా, సేల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌పై రూ. వెయ్యి ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం డిస్కౌంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మోటో జీ85పై భారీ డిస్కౌంట్ : – మోటో జీ85 5జీ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పీఓఎల్ఈడీ కర్వ్డ్-డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ షో-స్టాపింగ్ ఫీచర్ హై-ఎండ్ మోటో ఎడ్జ్ సిరీస్ మాదిరిగానే కర్వడ్ డిస్‌ప్లే. డిస్‌ప్లే శక్తివంతమైనది. – మోటో జీ85 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్3 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. కానీ, ఫోన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ వంటి ఏదైనా ఇతర ఫోన్లతో కూడా స్మార్ట్ కనెక్ట్‌ చేయొచ్చు. ప్రీమియం మోటో ఎడ్జ్ సిరీస్ నుంచి కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను షేర్ చేస్తుంది. మోటో జీ85 ఫ్యామిలీ స్పేస్, మోటో అన్‌ప్లగ్డ్ వంటి కొన్ని యుటిలిటీ ఫీచర్‌లను కూడా అందిస్తుంది. – స్మార్ట్‌ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. కేవలం సింగిల్ ఛార్జ్‌లో మోటో జీ85 మొత్తం రోజంతా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం అద్భుతంగా ఉన్నప్పటికీ, మెరుగైన ఛార్జింగ్ స్పీడ్ బాగుండేది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 0 శాతం నుంచి 100 శాతానికి ఛార్జ్ చేసేందుకు 80 నిమిషాలు పట్టింది. – మోటో జీ85 అనేది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌ను కలిగిన ఫస్ట్ మోటో జీ-సిరీస్ డివైజ్. 50ఎంపీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో బ్యాక్ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. డేలైట్, నైట్‌లైట్ ఫొటోలు రెండూ క్లియర్‌గా వస్తాయి. మోటో జీ85 ఫోన్ స్లో షట్టర్ స్పీడ్‌ని కలిగి ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :