Studio18 News - టెక్నాలజీ / : Reliance Jio Plans : జియో యూజర్లకు అలర్ట్.. ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధరలను సగటున 15 శాతం పెంచింది. కంపెనీ ఇప్పటికే ఉన్న ప్లాన్‌లపై కొన్ని బెనిఫిట్స్ కూడా సవరించింది. వివిధ కస్టమర్ల కోసం కొత్త ఆప్షన్లు కూడా రూపొందించింది. ఈ మార్పులతో వినియోగదారులు సరైన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. కొత్త ఆఫర్‌లలో రూ. 1,028, రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ రెండూ వినియోగదారులకు ఆకర్షణీయమైన బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ప్రతి ప్లాన్ ఏయే ఆఫర్లను అందిస్తుందో ఇప్పుడు చూద్దాం.. జియో రూ. 1,028 రీఛార్జ్ ప్లాన్ : రూ. 1,028 ధర కలిగిన ఈ ప్లాన్ 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంస్ అందిస్తుంది. అదనంగా, సబ్‌స్క్రైబర్‌లు 2జీబీ రోజువారీ డేటాను అందుకుంటారు. ఈ ప్లాన్ వ్యవధిలో మొత్తం 168జీబీ మొత్తం జియో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5జీ డేటాకు కూడా యాక్సెస్‌ను కలిగి ఉంటారు. రూ. 1,028 ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ మెంబర్‌షిప్ కూడా ఉంది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్‌లకు ఇది బెస్ట్. సబ్‌స్క్రైబర్‌లు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సేవలకు కూడా యాక్సెస్‌ను పొందవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ క్లౌడ్ స్టోరేజీ ఆప్షన్లను కూడా పొందవచ్చు. జియో రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్ : రూ. 1,029 ప్లాన్.. అనేక ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ 84 రోజుల వ్యవధిలో 2జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ బెనిఫిట్స్ అందిస్తుంది. స్ట్రీమింగ్ కంటెంట్‌ను కూడా అందిస్తుంది. రూ. 1,028 ప్లాన్ మాదిరిగానే జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాక్సెస్‌ని అందిస్తుంది. జియో 2 రీఛార్జ్ ప్లాన్లు : ఏది బెస్ట్ అంటే? : రెండు రీఛార్జ్ ప్లాన్‌లు అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తాయి. ప్రధానంగా కాంప్లిమెంటరీ సర్వీస్‌లలో విభిన్నంగా ఉంటాయి. మూవీలు, టీవీ షోలతో పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ రూ. 1,029 ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరోవైపు, రూ. 1,028 ప్లాన్ ఫుడ్ డెలివరీ డిస్కౌంట్‌లను కూడా అందిస్తోంది. స్విగ్గీ వన్ లైట్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ కొత్త రీఛార్జ్ ఆప్షన్లను కూడా ఉపయోగించుకోవచ్చు.
Admin
Studio18 News