Monday, 17 March 2025 05:43:39 PM
# Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు

Lava Agni 3 First Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా అగ్ని 3 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు..!

Date : 09 October 2024 05:14 PM Views : 142

Studio18 News - టెక్నాలజీ / : Lava Agni 3 First Sale : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లావా సరికొత్త ఫోన్ అగ్ని 3 ఫస్ట్ సేల్ మొదలైంది. ఇటీవలే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 3ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 2 స్టాండ్‌అవుట్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో ఐఫోన్ మాదిరిగా యాక్షన్ కీ, కెమెరా మాడ్యూల్‌లో సెకండరీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ సేల్ అమెజాన్, లావా హోమ్-వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. లావా అగ్ని 3 ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. లావా ఫస్ట్ సేల్ సందర్భంగా అన్ని వేరియంట్లపై కొన్ని డిస్కౌంట్లను అందిస్తోంది. లావా అగ్ని 3 ఫోన్ 128జీబీ, 256జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. అదనంగా, కొనుగోలుదారులు ఛార్జర్ లేకుండా తక్కువ ధరకు లావా ఫోన్ కొనుగోలు చేయొచ్చు. లావా అగ్ని 3 ధర, బ్యాంక్ ఆఫర్లు : భారత మార్కెట్లో లావా అగ్ని 3 లాంచ్ ధర రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది. లావా 8జీబీ+128జీబీ వేరియంట్‌ను ఛార్జర్ లేకుండా రూ. 20,999, ఛార్జర్‌తో రూ. 22,999కి అందిస్తోంది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.24,999కి అందుబాటులో ఉంటుంది. కాంటాక్టు ఆఫర్‌తో ప్రతి మోడల్‌కు రూ. 2వేలు తగ్గింపు, బాక్స్‌లో ఛార్జర్ లేని వేరియంట్‌పై రూ. వెయ్యి తగ్గింపు కూడా పొందవచ్చు. 8జీబీ+128జీబీ (ఛార్జర్ లేకుండా) రూ. 19,999 8జీబీ+128జీబీ (ఛార్జర్‌తో) రూ. 20,999 8జీబీ+256జీబీ రూ. 22,999. అదనంగా, అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1,150 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. లావా అగ్ని 3 కీలక స్పెషిఫికేషన్ల, ఫీచర్లు : ముందుగా లావా ఫోన్ ప్రత్యేక ఫీచర్ల గురించి మాట్లాడితే.. పవర్ బటన్ పైన యాక్షన్ కీ ఐఫోన్ 16 సిరీస్ మాదిరిగానే పనిచేస్తుంది. మీ అవసరానికి తగినట్టుగా కీని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ లావా అగ్ని ఫోన్ 3 గెచర్స్ కలిగి ఉంది. సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్, లాంగ్ ప్రెస్ ద్వారా నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కెమెరా మాడ్యూల్‌లో సెకండరీ స్క్రీన్ మరో ప్రత్యేకమైన ఫీచర్. ఈ ఇన్‌స్టాస్క్రీన్‌తో మీరు నోటిఫికేషన్‌లను చూడవచ్చు. కొత్త యానిమేషన్ ఫైరీతో ఆడుకోవచ్చు. ఇన్‌స్టాస్క్రీన్ స్టాప్‌వాచ్, టైమర్‌ కూడా ఉంది. సెల్ఫీలు క్లిక్ చేసే విధానం కూడా మార్చుకోవచ్చు. డిజైన్‌ విషయానికి వస్తే.. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ గ్రిప్ కలిగి ఉంది. ఈ అడ్వాన్స్‌డ్ డిజైన్ స్టైల్, ఫంక్షనాలిటీతో వస్తుంది. భారతీయ మార్కెట్‌లో లావా అగ్ని 3 ఫోన్ ప్రిస్టిన్ వైట్, హీథర్ బ్లూ అనే మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. లావా అగ్ని 3 డిస్‌ప్లే కర్వడ్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో రెండు అమోల్డ్ స్క్రీన్‌లు ఉన్నాయి. 6.78-అంగుళాల 120Hz ఫ్రంట్ డిస్‌ప్లే, బ్యాక్ సైడ్ 1.74-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే కూడా కలిగి ఉంది. 8జీబీ ర్యామ్, హుడ్ కింద మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1, ఐక్యూ జెడ్9ఎస్, మోటో ఎడ్జ్ 50 నియోతో పోటీపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. అగ్ని సిరీస్ మూడో మోడల్ బ్లోట్‌వేర్-ప్రీ యూఐని కలిగి ఉంది. లావా అగ్ని 3 క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ (ఓఐఎస్), 8ఎంపీ అల్ట్రావైడ్, 8ఎంపీ టెలిఫోటో (3ఎక్స్ జూమ్), 16ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :