Studio18 News - టెక్నాలజీ / : YouTube Shorts : యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్.. యూట్యూబ్ షార్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లో మరో బిగ్ అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది. క్రియేటర్‌లు 3 నిమిషాల నిడివి గల వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. అక్టోబర్ 15, 2024 నుంచి ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. మొదట్లో 60-సెకన్ల వీడియోలపై దృష్టి సారించిన యూట్యూబ్ షార్ట్‌లలో ఇప్పుడు ఏకంగా 3 నిమిషాల నిడివి గల కంటెంట్‌ని క్రియేట్ చేసేలా అనుమతించనుంది. క్రియేటర్‌లకు స్టోరీలు చెప్పడంతో పాటు వ్యూయర్లతో ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు మరింత అవకాశాన్ని అందిస్తుంది. లాంగ్ వీడియోలకు మరింత సపోర్టు : గతంలో, యూట్యూబ్ షార్ట్స్ సాధారణంగా ఒక నిమిషం లోపు ఉండే లాంగ్ వీడియోలపై దృష్టిపెట్టింది. ఈ షార్ట్ వీడియోలు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో యూట్యూబ్ పోటీపడుతోంది. అయితే, ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు లాంగ్ వీడియోలకు సపోర్టు అందించనుంది. క్రియేటర్లకు వారి కంటెంట్‌ను డెవలప్ చేసేందుకు మరింత స్టోరేజీని అందిస్తుంది. ఈ మార్పుతో గతంలో అప్‌లోడ్ చేసిన వీడియోలపై ప్రభావం చూపదు. వినియోగదారులు లాంగ్ షార్ట్‌లను కనుగొనడంలో సాయపడేందుకు యూట్యూబ్ సిఫార్సు సిస్టమ్ మెరుగుపరచడంపై పనిచేస్తోంది. ట్రెండింగ్ వీడియోలతో రీమిక్స్ ఆప్షన్ : ఎక్కువ వీడియో నిడివితో పాటు, కంటెంట్ క్రియేటివ్ మరింత ఆకర్షణీయంగా చేయడానికి యూట్యూబ్ అనేక కొత్త ఫీచర్‌లను ప్రవేశపెడుతోంది. ఇందులో టూల్ టెంప్లేట్‌లను అందిస్తుంది. షార్ట్‌లో “రీమిక్స్” బటన్‌ను ట్యాప్ చేసి “Use This Template ” ఎంచుకోవడం ద్వారా ట్రెండింగ్ వీడియోలను సులభంగా రీమిక్స్ చేసుకోవచ్చు. రీక్రియేట్ చేయడానికి ఈ ఫీచర్ యూజర్లను అనుమతిస్తుంది. రాబోయే నెలల్లో రిలీజ్ అయ్యే మరో అప్‌డేట్ షార్ట్‌లలో మరిన్ని యూట్యూబ్ కంటెంట్‌ని ఇంటిగ్రేట్ చేయనుంది. క్రియేటర్‌లు త్వరలో తమ షార్ట్‌లను క్రియేట్ చేసేందుకు మ్యూజిక్ వీడియోలతో సహా వివిధ యూట్యూబ్ వీడియోల నుంచి క్లిప్‌లను వినియోగించవచ్చు. ఈ ఫీచర్ మరింత క్రియేటివిటీని అనుమతిస్తుంది. అంతేకాకుండా, గూగుల్ డీప్‌మైండ్ అడ్వాన్స్‌డ్ వీడియో మోడల్, వియో కూడా ఈ ఏడాది చివర్లో షార్ట్స్‌లో మెర్జ్ కానుంది. క్రియేటర్లకు మరింత పవర్‌ఫుల్ వీడియో బ్యాక్‌గ్రౌండ్ స్టాండెడ్ క్లిప్‌లను అందిస్తుంది. యూట్యూబ్ వ్యూయర్ల కోసం వినియోగదారులు వైరల్ కంటెంట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేలాయూట్యూబ్ కొత్త “షార్ట్‌ల ట్రెండ్‌లు” పేజీని కూడా ప్రారంభిస్తోంది. అదనంగా, యూజర్లు నేరుగా షార్ట్స్ ఫీడ్ నుంచి కామెంట్లలో ఏమి చెబుతున్నారనే ప్రివ్యూని పొందవచ్చు. తద్వారా కమ్యూనిటీతో ఎంగేజ్‌మెంట్ పెంచుకోవచ్చు. ఈ అప్‌డేట్‌లు యూట్యూబ్ షార్ట్స్ క్రియేటర్లు, వ్యూయర్లకు కస్టమైజడ్ ఆప్షన్లను అందిస్తాయి.
Admin
Studio18 News