Thursday, 14 November 2024 05:41:48 AM
# #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు.. # కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం.. # బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత # లక్నో బయల్దేరిన రామ్ చరణ్

Apple Retail Stores : ఢిల్లీ, ముంబై తర్వాత భారత్‌లో మరో 4 ఆపిల్ రిటైల్ స్టోర్లు రాబోతున్నాయి..!

Date : 04 October 2024 04:55 PM Views : 32

Studio18 News - టెక్నాలజీ / : Apple Retail Stores : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ భారత మార్కెట్లో రిటైల్ స్టోర్లను మరింతగా విస్తరించనుంది. దేశ రిటైల్ మార్కెట్లో కొత్తగా మరో 4 రిటైల్ ఆపిల్ స్టోర్లు రాబోతున్నాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ,ముంబైలలో మొదటి రెండు ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్లను ప్రారంభించిన ఆపిల్.. రాబోయే రోజుల్లో మరో నాలుగు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఢిల్లీ, ముంబై రిటైల్ స్టోర్లకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో టెక్ దిగ్గజం ఇప్పుడు మరిన్ని రిటైల్ స్టోర్లను విస్తరించాలని భావిస్తోంది. భారత్ మార్కెట్లో ఆపిల్ ప్రీమియం ప్రో, ఐఫోన్ ప్రో ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్‌లతో సహా మొత్తం ఐఫోన్ 16 లైనప్‌ను ఇక్కడే కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. వినియోగదారుల మార్కెట్, తయారీ కేంద్రంగా దేశంతో సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఏయే నగరాల్లో కొత్త ఆపిల్ స్టోర్‌లు రానున్నాయంటే? : ఆపిల్ ఉత్పత్తులకు భారత్ కేంద్రంగా మారుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ, ముంబైలలో మొదటి స్టోర్‌లు భారీ విజయాన్ని సాధించాయి. దాంతో ఆపిల్ మరో నాలుగు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే ఆపిల్ స్టోర్‌లు బెంగళూరు, పూణే, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా, ఆపిల్ ముంబైలో మరో స్టోర్‌ను కూడా ప్లాన్ చేస్తోంది. ప్రారంభంలోనే మొదటి రెండు స్టోర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. భారత్‌లో ఆపిల్ ఆదాయానికి ఈ రెండు స్టోర్‌లు గణనీయంగా దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. దేశంలోని ఆపిల్ వ్యాపారంలో ఢిల్లీ, ముంబై మాత్రమే ఐదవ వంతుకు పైగా ఉన్నాయి. విలాసవంతమైన గాడ్జెట్‌ల పట్ల భారత్ వినియోగదారుల్లో పెరుగుతున్న ఆసక్తి ఇందుకు కారణంగా చెప్పవచ్చు. భారత్‌లోనే ఐఫోన్ 16ను తయారు చేస్తోందా? : ఆపిల్ ఇప్పుడు హై-ఎండ్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌తో సహా మొత్తం ఐఫోన్ 16 లైనప్‌ను భారత్ మార్కెట్లోనే ఉత్పత్తి చేస్తోంది. ఆపిల్, ఇండియా రెండింటికీ భారీ డీల్ అని చెప్పవచ్చు. ఇంతకుముందు, ఆపిల్ భారత్‌లో పాత ఐఫోన్ మోడల్‌లను మాత్రమే తయారు చేసింది. కానీ, ఇప్పుడు తమ లేటెస్ట్, అత్యంత ప్రీమియం ఫోన్లను కూడా తయారుచేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఐఫోన్లను తయారు చేయడానికి ఆపిల్ ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉందని నివేదిక వెల్లడించింది. ఐఫోన్ 16, 16 ప్లస్, ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్‌లకు ఫాక్స్‌కాన్ బాధ్యత వహిస్తుండగా, పెగాట్రాన్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోలను నిర్వహిస్తోంది. టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్‌లను కూడా తయారు చేయనుంది. ఈ ఐఫోన్లు భారత మార్కెట్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :