Studio18 News - టెక్నాలజీ / : AC Cool Faster Tips : మీ ఇంట్లో ఏసీ ఉందా? ఏసీ వేసినా తొందరగా కూల్ కావడం లేదా? ఏసీల వాడకంతో కరెంటు బిల్లులు భారీగా వస్తుందా? ప్రస్తుత రోజుల్లో ఎయిర్ కండిషనర్లు 24/7 వాడుతూనే ఉన్నారు. దాంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. మీరు పెరుగుతున్న విద్యుత్ బిల్లుల గురించి ఆందోళన చెందుతుంటే ఇది మీకోమే. మీ ఏసీ తగినంత కూలింగ్ అయ్యేలా కొన్నింటిలో మార్పులు చేసుకోవాలి. ఎయిర్ కండిషనర్ వేగంగా కూలింగ్ కావడమే కాదు.. నెలవారీగా వచ్చే కరెంట్ బిల్లు కూడా భారీగా తగ్గించుకోవచ్చు. ఈ 10 సింపుల్ టిప్స్ ఓసారి పాటించి చూడండి.. 1.తగినంత ఉష్ణోగ్రత : ఏసీ ఉష్ణోగ్రతను కనిష్టంగా సెట్ చేస్తే.. ఏసి గదిని వేగంగా చల్లబరుస్తుందని భావిస్తంటారు. కానీ, అలా కాదు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం.. 24 డిగ్రీలు అనేది మనిషి శరీరానికి అనువైన ఉష్ణోగ్రత. కాబట్టి, మీ ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచడం వల్ల మీ గది సౌకర్యవంతంగా ఉంటుంది. మెషీన్‌పై లోడ్ కూడా తగ్గుతుంది. తద్వారా మీ ఏసీ సమర్థవంతంగా తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. 2.రెగ్యులర్ AC సర్వీసింగ్ : ఏసీ నిర్వహణ సరిగా ఉంటే.. మిషన్ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. తద్వారా డబ్బు కూడా ఆదా అవుతుంది. మీ ఏసీ రెగ్యులర్ సర్వీసింగ్‌ను తప్పనిసరిగా షెడ్యూల్ చేయాలి. వేసవి సీజన్ ప్రారంభంలో ఏసీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మీరు ఏసీని కొనుగోలు చేసిన కంపెనీ నుంచి టెక్ నిపుణులను పిలవాలి. 3.ఏసీ ఫిల్టర్‌ని క్రమం తప్పకుండా క్లీన్ చేయండి : ఏసీ సర్వీసింగ్ ఒక సీజన్‌లో ఒకటి లేదా రెండుసార్లు చేయవచ్చు. అయితే, ఏసీ ఫిల్టర్‌లను క్లీనింగ్ అనేది ప్రతి నెల లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేయాలి. కాలుష్యం, దుమ్మతో AC ఫిల్టర్‌లకు అడ్డుపడతాయి. తద్వారా మిషన్ కూలింగ్ కాదు. మరింత శక్తిని వినియోగిస్తుంది. వేడి గాలి వస్తుంది. మీ AC ఫిల్టర్‌ను నీటితో క్రమం తప్పకుండా క్లీన్ చేయండి. అదనంగా, మీరు కండెన్సర్ యూనిట్‌ను కూడా శుభ్రం చేయాలి. ఎందుకంటే అది బయట ఉంచతారు.. దానిపై బాగా మురికిగా ఉంటుంది. 4.అన్ని ఎయిర్ లీక్‌లను మూసివేయండి : మీ AC సామర్థ్యాన్ని పెంచడానికి, చల్లని గాలి బయటకు పోకుండా అన్ని కిటికీలు, తలుపులు మూసి ఉంచండి. 5.సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయండి : గాలి ప్రసరణ, కూలింగ్ స్పీడ్ మెరుగుపరచేందుకు ACతో పాటు మీ సీలింగ్ ఫ్యాన్‌ను కూడా ఆన్ చేయవచ్చు. మితమైన వేగంతో ఫ్యాన్‌లను వాడితే గది అంతటా చల్లటి గాలిని సమర్థవంతంగా పంపిణీ చేయడంలో సాయపడుతుంది. 6.AC మోడ్‌లను చెక్ చేయండి : మీ AC యూనిట్‌లో అందుబాటులో ఉన్న విభిన్న మోడ్‌లను చెక్ చేయండి. అనేక ఆధునిక ACలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించగలవు. అందులో 80 శాతం, 60 శాతం లేదా 25 శాతం సామర్థ్యం వంటి వివిధ మోడ్‌లను అందిస్తాయి. మీ గది వాతావరణ పరిస్థితులకు ఏది మంచిదో గుర్తించేందుకు ఈ మోడ్‌లతో టెస్టింగ్ చేయండి. 7.టైమర్‌ని ఆన్ చేయండి : చాలా ఏసీలు ఇంటర్నల్ టైమర్‌ని కలిగి ఉంటాయి. మీరు నిద్రపోయే ముందు టైమర్‌ని సెట్ చేయండి, గది తగినంత చల్లగా ఉన్న తర్వాత 1 లేదా 2 గంటల తర్వాత AC ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. దీనివల్ల రాత్రిపూట విద్యుత్ వినియోగం తగ్గుతుంది. టైమర్ యూనిట్‌ను ఆఫ్ చేసేందుకు మీరు నిద్ర మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. 8.ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్ ఉపయోగించండి : ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్ రోజులో వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఉష్ణోగ్రతలను సెట్ చేయడానికి అనుమతిస్తుంది. మీరు నిద్రిస్తున్నప్పుడు లేదా దూరంగా ఉన్నప్పుడు కూలింగ్ తగ్గించడం ద్వారా శక్తిని ఆదా చేయడంలో సాయపడుతుంది. 9.మీ ACని అప్‌గ్రేడ్ చేయండి : మీ ఏసీ పాతది అయితే వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి. కొత్త AC యూనిట్లు చాలా శక్తివంతమైనవిగా ఉంటాయి. మీ పవర్ బిల్లులపై డబ్బు ఆదా చేస్తాయి. 4-5 స్టార్ రేటింగ్ ఏసీలను ఎంచుకోండి. ఎందుకంటే ఆయా ఏసీలు బాగా పనిచేస్తాయి. 10.అవసరం లేనప్పుడు AC ఆఫ్ చేయండి : ముఖ్యంగా, మీకు ఏసీ అవసరం లేకుంటే వెంటనే మీ ACని పూర్తిగా ఆఫ్ చేయండి. కేవలం రిమోట్ కంట్రోల్‌పై ఆధారపడరాదు. విద్యుత్తు వృధా కాకుండా మెయిన్ స్విచ్ నుంచి ఏసీ స్విచ్ ఆఫ్ చేయండి.
Admin
Studio18 News