Studio18 News - టెక్నాలజీ / : Google Pay CIBIL Score : మీరు హోమ్ లోన్, కార్ లోన్ లేదా మరేదైనా లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, గుడ్ సిబిల్ స్కోర్ తప్పక ఉండాలి. అయితే, చాలా మంది వినియోగదారులు తమ సిబిల్ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవాలో కచ్చితంగా తెలియదు. గూగుల్ పే యాప్ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా మీ సిబిల్ స్కోర్‌ను చెక్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ సర్వీసును చాలా ఉచితంగా అందిస్తుంది. మీ స్కోర్‌ను డిస్‌ప్లే చేయడమే కాకుండా నిర్దిష్ట నెల, సంవత్సరంతో సహా ఏవైనా ఆలస్యమైన పేమెంట్ల వివరాలను కూడా అందిస్తుంది. సెకన్లలో సమగ్ర నివేదిక కూడా రూపొందిస్తుంది. గూగుల్ ప్రకారం.. ఈ ఫీచర్‌ను రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 5 కోట్ల మంది భారతీయులు ఉపయోగించారు. గూగుల్ పే యాప్‌లో మీ సిబిల్ స్కోర్‌ను ఎలా చెక్ చేయాలంటే? : మీ సిబిల్ స్కోర్ అనేది 3-అంకెల సంఖ్య. మీ క్రెడిట్ క్వాలిటీని సూచిస్తుంది. రుణదాతలు మీ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్‌లను ఆమోదించాలో లేదో అంచనా వేసేందుకు సాయపడుతుంది.750 కన్నా ఎక్కువ స్కోరు గుడ్ స్కోరు అని చెప్పవచ్చు. అయితే, 850 కన్నా ఎక్కువ స్కోరు ఇంకా అద్భుతం. మీ క్రెడిట్ హెల్త్ ట్రాక్ చేయడానికి మీ సిబిల్ స్కోర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయడం చాలా ముఖ్యం. గూగుల్ పే అదనపు ఖర్చు లేకుండా సులభంగా క్రెడిట్ సిబిల్ స్కోరు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. గూగుల్ పేలో మీ సిబిల్ స్కోర్‌ని చాలా వేగంగా చెక్ చేయొచ్చు. (TransUnion CIBIL) ద్వారా పొందవచ్చు. మీ సిబిల్ స్కోర్ ముఖ్యమైనది. ఎందుకంటే.. మీరు లోన్‌లు లేదా క్రెడిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసినప్పుడు మీ క్రెడిట్ హెల్త్ అంచనా వేసేందుకు రుణదాతలకు సాయపడుతుంది. గూగుల్ పే ఇప్పుడు వినియోగదారులను వారి సిబిల్ స్కోర్‌ను ఉచితంగా చెక్ చేసేందుకు అనుమతిస్తుంది. అలాగే, సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలో కూడా సిఫార్సులను అందిస్తుంది. మీరు గూగుల్ పే ఉపయోగించి మీ సిబిల్ స్కోర్‌ని ఎలా చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ పే యాప్‌ని ఇన్ స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ పే యాప్‌ని ఓపెన్ చేయండి. సిబిల్ స్కోర్ సెక్షన్‌కు వెళ్లండి హోమ్‌పేజీలో, “Manage your money” సెక్షన్ స్క్రోల్ చేయండి. “మీ సిబిల్ స్కోర్‌ని ఉచితంగా చెక్ చేసుకోండి” అనే ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటించండి. మీ సిబిల్ స్కోర్‌ను పొందడానికి గూగుల్ పే యూజర్లకు కొన్ని సూచనలు చేస్తుంది. మీ సిబిల్ స్కోర్‌ని మొదటిసారి చెక్ చేస్తుంటే.. మీరు కొన్ని వివరాలను తప్పక సమర్పించాలి. ఫుల్ నేమ్ : మీ డాక్యుమెంట్లపై కనిపించే విధంగా మీ ఫుల్ లీగల్ నేమ్ ఎంటర్ చేయండి. ఫోన్ నంబర్ : మీ ఆర్థిక అకౌంట్లకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను అందించాలి. ఇమెయిల్ ఐడీ (ఆప్షనల్): మీకు కావాలంటే మీ ఇమెయిల్ అడ్రస్ రిజిస్టర్ చేయవచ్చు. అయితే ఇది తప్పనిసరి కాదని గమనించాలి. పాన్ కార్డు (ఆప్షనల్): మీకు పాన్ కార్డు ఆప్షనల్ అయితే.. మీ పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మీ సిబిల్ స్కోర్‌ను రివ్యూ చేయండి. మీరు అవసరమైన సమాచారంతో గూగుల్ పే మీ సిబిల్ స్కోర్, క్రెడిట్ నివేదికను సెకన్లలో స్క్రీన్‌పై చూపిస్తుంది. మీరు ప్రతి నెలా మీ స్కోర్‌ను పెంచుకోవడంతో పాటు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను ఎలా రిఫ్రెష్ చేయాలనే దానిపై సిఫార్సులను కూడా పొందవచ్చు. ఈ ఫీచర్ గూగుల్ పే ద్వారా నేరుగా మీ క్రెడిట్ హెల్త్‌లో టాప్‌లో ఉండేలా చేస్తుంది.
Admin
Studio18 News