Studio18 News - టెక్నాలజీ / : Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇటీవలే ప్రారంభమైంది. త్వరలో సేల్ ముగియనుంది. చివరి తేదీ అక్టోబర్ 8 మాత్రమే. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్, ఇతర ఫోన్ల ధరలు త్వరలో పెరుగుతాయి. ఈ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ సమయంలో స్టాండర్డ్ ఐఫోన్ 15, ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్‌లు భారీ తగ్గింపును పొందాయి. మీరు ఇప్పటికే ఈ డీల్‌లను పొందాలనుకుంటే లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఒకవేళ మీరు అన్ని ఐఫోన్ 15 డీల్‌లను మిస్ అయితే ఈ ధరలను ఓసారి పరిశీలించండి. ఐఫోన్ 15 ఫ్లిప్‌కార్ట్ డీల్ ధర : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15ని రూ.57,999కి విక్రయిస్తోంది. ఆపిల్ స్టోర్ ప్రస్తుతం ఈ ఐఫోన్‌ను రూ. 69,900కి అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 11,901 ఫ్లాట్ తగ్గింపును ఇస్తోంది. ఐఫోన్ 15ని తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. అంతేకాదు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 4వేల వరకు 10 శాతం డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రోపై ఫ్లిప్‌కార్ట్ డీల్ : ఐఫోన్ 15ప్రో 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,06,999కి అందుబాటులో ఉంది. ప్రో వెర్షన్‌లో ఇదే బెస్ట్ డీల్. ఆపిల్ ఈ ఫోన్ నిలిపివేసింది. కానీ, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు దీన్ని విక్రయిస్తున్నాయి. ఆపిల్ ఈ ఐఫోన్ మోడల్‌ను రూ. 1,34,999కి లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ రూ. 28వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ డీల్ ద్వారా యూపీఐ లావాదేవీలపై రూ. 4వేలు తగ్గింపు కూడా పొందవచ్చు. తద్వారా ఈ ఐఫోన్ 15ప్రో ధర రూ. 1,02,999కి తగ్గుతుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫ్లిప్‌కార్ట్ డీల్ ధర : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,59,999 నుంచి రూ. 1,26,999కి జాబితా అయింది. ఆపిల్ అత్యంత ఖరీదైన ఐఫోన్‌లలో ఇదొకటి. ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఈ ప్రో మాక్స్ మోడల్ ధర భారీగా తగ్గింది. కానీ, ఈ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకు అమ్ముడవుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో మరిన్ని డిస్కౌంట్‌లను పొందడానికి బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను కూడా యాక్సస్ చేయొచ్చు. ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ రెండూ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌కి అర్హత కలిగి ఉన్నాయి. కనీసం సెప్టెంబర్ 2028 వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందుకోవచ్చు.
Admin
Studio18 News