Saturday, 22 March 2025 08:23:50 AM
# NPCI: ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత # Honey Trap: కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు # Posani Krishna Murali: పోసానికి ఊరట... సీఐడీ కేసులో బెయిల్ మంజూరు # Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత.. # తిరుమలలో చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికిచ్చిన 35 ఎకరాలు క్యాన్సిల్.. # Tirumala: నారా దేవాన్ష్​లా మీరూ టీటీడీ అన్నప్రసాదం ట్ర‌స్టుకు విరాళం ఇవ్వొచ్చు.. దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే? # Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్.. # Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..! # IPL 2025: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే? # Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి.. # Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్.. # పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు తెలిపింది. ఐక్యూ Z10 సిరీస్‌లో Pro, Z10x వేరియంట్ కూడా ఉంటుందని గతంలో # Telangana Assembly: సై అంటే సై.. అసెంబ్లీలో రగడ.. హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి.. # Gold Price: రాబోయే మూడు నెలల్లో బంగారం ధరలు ఎంతగా పెరుగుతాయో తెలుసా? # MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..! # Gold: బాబోయ్.. బంగారం రికార్డులే రికార్డులు.. ఆశ్చర్యపరుస్తున్న డబ్ల్యూజీసీ తాజా గణాంకాలు.. 2025 చివరి నాటికి.. # Tata Car Prices : కొత్త కారు కావాలా? ఏప్రిల్‌లో భారీగా పెరగనున్న టాటా PV, EV కార్ల ధరలు.. ఇప్పుడు కొంటేనే బెటర్..! # Mahesh Babu – Sitara : మహేష్ బాబుకే నేర్పిస్తున్న కూతురు సితార.. జెన్ జీ అంటే అట్లుంటది మరి.. వీడియో వైరల్.. # McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు.. # Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!

iPhone Order : ఆన్‌లైన్‌లో రూ. 1.5 లక్షల ఐఫోన్ ఆర్డర్ చేసి.. డెలివరీ ఏజెంట్‌ను చంపేసిన ఫ్లిప్‌కార్ట్ కస్టమర్..!

Date : 02 October 2024 11:59 AM Views : 103

Studio18 News - టెక్నాలజీ / : iPhone Order : ప్రతిఒక్కరిని ఆన్‌లైన్‌ సేల్ పండగ ఆఫర్లు ఊరిస్తున్నాయి. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారాల్లో అనేక స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లను గుప్పిస్తున్నాయి. ఈ సేల్ సమయంలో ఒక ఫ్లిప్‌కార్ట్ యూజర్ ఆపిల్ ఐఫోన్ కోసం ఆర్డర్ పెట్టాడు. అయితే, ఆన్‌లైన్ పేమెంట్ చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఐఫోన్ డెలివరీ కాగానే డెలివరీ ఏజెంట్ ఆర్డర్ డబ్బులు చెల్లించాల్సిందిగా కోరాడు. దాంతో ఆ ఫ్లిప్‌కార్ట్ యూజర్ అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఖరీదైన ఐఫోన్ డబ్బులు చెల్లించకుండా ఉండేందుకు ఏకంగా ఆ డెలివరీ ఏజెంట్‌ను చంపేందుకు సిద్ధపడ్డాడు. తన స్నేహితుడితో ఆ డెలివరీ ఏజెంట్‌ను గొంత కోసి దారుణంగా హత్యచేశాడు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్. పక్కా పథకం ప్రకారమే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఇందిరా కాలనీలో జరిగింది. అనంతరం డెలివరీ ఏజెంట్‌ మృతదేహాన్ని నిందితులిద్దరూ గోనె సంచిలో వేసి కెనాల్‌లో పడవేసినట్లు పోలీసులు వెల్లడించారు. డెలివరీ ఏజెంట్ మృతదేహం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. గజానన్‌గా గుర్తించిన నిందితుడు ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్‌ను ఆర్డర్ చేసి, COD (క్యాష్ ఆన్ డెలివరీ) పేమెంట్ ఎంపికను ఎంచుకున్నాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ శశాంక్ సింగ్ పేర్కొన్నారు. గొంతునులిమి దారుణ హత్య : వివరాల్లోకి వెళితే.. యూపీలోని లక్నోలో గత నెల 23న ఈ ఘటన జరిగింది. నిషాత్‌గంజ్‌కు చెందిన భరత్ సాహు ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా భరత్ ఐఫోన్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్‌ను గజానన్ అనే ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ ఆర్డర్ చేశాడు. దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకున్నాడు. ఆ ఐఫోన్ డెలివరీ చేసేందుకు భరత్ దగ్గరికి వెళ్లాడు. ఆ ఐఫోన్ డెలివరీ చేయగానే డబ్బులు చెల్లించామని గజానన్‌ను అతడు అడిగాడు. దాంతో సాహును మరో వ్యక్తితో కలిసి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అతడి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇందిరా కెనాల్‌లో పారేశారు. మృతదేహాన్ని గుర్తించేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం రంగంలోకి దిగింది. సాహు కుటుంబం ఫిర్యాదుతో వెలుగులోకి : సాహు రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో సెప్టెంబర్ 25న చిన్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. “నా సోదరుడు ఒక ప్రొడక్టు డెలివరీ చేయడానికి వెళ్ళాడు. అతను డెలివరీ చేసిన ప్రొడక్టు ధరను డిమాండ్ చేసినప్పుడు కస్టమర్ నా సోదరుడిని చంపాడు. నా సోదరుడికి న్యాయం చేయాలి. అతనికి వివాహం జరిగింది” అని వాపోయాడు. సాహు కాల్ వివరాలను స్కాన్ చేసి.. అతని లొకేషన్‌ను కనుగొనే ప్రయత్నంలో, పోలీసులు గజానన్ నంబర్‌ను కనుగొని అతని స్నేహితుడు ఆకాష్‌ను విచారించారు. విచారణలో ఆకాష్ నేరం అంగీకరించాడని డీసీపీ వెల్లడించారు. హత్యా ఘటనపై ఫ్లిప్‌కార్ట్ ప్రకటన : దీనిపై ఫ్లిప్‌కార్ట్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. “మా డెలివరీ ఏజెంట్‌తో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన పట్ల చింతిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా ఉంటాం. డెలివరీ ఏజెంట్ కుటుంబానికి సాధ్యమైన సహాయాన్ని అందిస్తాం. పోలీసుల విచారణలో కూడా మావంతుగా సహకరిస్తాం” అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :