Studio18 News - టెక్నాలజీ / : Motorola Moto G85 Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా సరికొత్త మోటో జీ85 ఫోన్ ధర తగ్గింది. ఇటీవలే భారత మార్కెట్లో మోటోరోలా మోటో G85 లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా మిడ్ రేంజ్ ఫోన్ భారీగా తగ్గింపును పొందింది. మోటోరోలా మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో కొన్ని బెస్ట్ ఫోన్‌లను అందిస్తోంది. ఇతర ఫోన్లకు పోటీకి సమానంగా పర్ఫార్మెన్స్ అందిస్తోంది. వినియోగదారులను ఆకర్షించడానికి కొన్ని అదనపు ఫీచర్లను కూడా అందిస్తోంది. మీరు మోటోరోలా మోటో జీ85ని కొనుగోలు చేసేవారికి ఇదే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మోటో జీ85 భారీ డిస్కౌంట్ : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా మోటో జీ85 రూ. 16,999 ప్రారంభ ధరతో వస్తుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ఫోన్ దేశంలో రూ. 17,999కి అందుబాటులో ఉంది. అంటే వినియోగదారులు ఈ మోటో జీ85 స్మార్ట్‌ఫోన్‌పై రూ. వెయ్యి ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,250 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ మోటోరోలా ఫోన్‌ను మరింత తక్కువ ధరకు పొందాలంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. మోటోరోలా మోటో జీ85 కీలక స్పెక్స్, ఫీచర్లు : మోటో జీ85 ఫోన్ కొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌ని ఉపయోగిస్తోంది. మోటోరోలా 2ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లను అందిస్తోంది. అయితే, నాలుగేళ్ల భద్రతా ప్యాచ్‌లను కూడా అందిస్తోంది. బయోమెట్రిక్స్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. మోటోరోలా డివైజ్ డాల్‌బై ఆట్మోస్ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా ఐపీ52-రేట్ అయింది. నీటి స్ప్లాష్‌లను తట్టుకోగలదు. వర్షాకాలంలో కూడా పాడైపోదు. మోటో జీ85 50ఎంపీ ప్రైమరీ సోనీ ఎల్‌టీఐఏ 600 సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మోటో జీ85 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో ఒక సాధారణ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Admin
Studio18 News