Studio18 News - టెక్నాలజీ / : Airtel AI Spam Detection : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ దేశపు మొట్టమొదటి నెట్‌వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ పద్ధతిని ప్రారంభించింది. ఈ కొత్త స్పామ్ డిటెక్షన్ అనేది టెలికం కస్టమర్‌లకు స్పామ్ కాల్స్, అనవసరమైన కమ్యూనికేషన్ సమస్యను నివారించేందుకు ఏఐని ఉపయోగిస్తుంది. దేశంలోని టెలికాం ప్రొవైడర్ నుంచి మార్గదర్శక పరిష్కారంగా ఈ టూల్ అనుమానిత స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ గురించి వినియోగదారులకు రియల్ టైమ్‌లోనే తెలియజేస్తుంది. అనవసరమైన కమ్యూనికేషన్ నుంచి మెరుగైన ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ సొలుష్యన్ ఫ్రీ ఎయిర్‌టెల్ కస్టమర్‌లందరికీ సర్వీస్ రిక్వెస్ట్ లేకుండానే లేదా యాప్‌ని డౌన్‌లోడ్ చేయకుండానే ఆటో-యాక్టివేట్ అవుతుంది. భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. “స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. గత పన్నెండు నెలలుగా దీన్ని సమగ్రంగా పరిష్కరించాం. దేశంలోని మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్ ఫ్రీ నెట్‌వర్క్‌ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా కస్టమర్‌లను అనుచిత అవాంఛిత కమ్యూనికేషన్‌ల నుంచి రక్షిస్తుంది” అని పేర్కొన్నారు. ఇది ఎలా పని చేస్తుందంటే? : ఎయిర్‌టెల్ డేటా సైంటిస్టులచే అంతర్గతంగా రూపొందించిన ఏఐ-ఆధారిత సొల్యూషన్ అనేది స్పామ్ కాల్స్ ఎస్ఎంఎస్ “అనుమానాస్పద స్పామ్”గా గుర్తించగలదు. ఇందుకోసం మేనేజ్ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ సీఈఓ విట్టల్ వివరించారు. ఈ ఏఐ సొలుష్యన్ మొత్తం రెండు ఫిల్టర్‌లను కలిగి ఉంది. అందులో ఒకటి నెట్‌వర్క్ లేయర్, రెండవది ఐటీ సిస్టమ్స్ లేయర్ వద్ద ఉంటుంది. ప్రతి కాల్, ఎస్ఎంఎస్ ఈ డబుల్-లేయర్డ్ ఏఐ షీల్డ్ గుండా వెళుతుంది. 2 మిల్లీసెకన్లలో ప్రతిరోజూ 1.5 బిలియన్ సందేశాలను 2.5 బిలియన్ కాల్‌లను ప్రాసెస్ చేస్తుంది. ఏఐ శక్తిని ఉపయోగించి రియల్ టైమ్ ప్రాతిపదికన 1 ట్రిలియన్ రికార్డులను ప్రాసెస్ చేయగలదు. ఫోన్ కాలర్ లేదా పంపినవారి వినియోగ విధానాలు, కాల్/ఎస్ఎంఎస్ ఫ్రీక్వెన్సీ, కాల్ వ్యవధి ఇతర పారామితుల వంటి వివిధ రియల్ టైమ్ కారకాలను విశ్లేషించడానికి నెట్‌వర్క్ అత్యాధునిక ఏఐ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఏఐ కమ్యూనికేషన్ ద్వారా సమర్ధవంతంగా ప్రాసెస్ చేసేలా సిస్టమ్‌ను అలర్ట్ చేస్తుంది. కొన్ని స్పామ్ కాల్స్ గుర్తించి దాని సమాచారాన్ని క్రాస్-రిఫరెన్స్ చేస్తుంది. తద్వారా సిస్టమ్ అనుమానిత స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లను కచ్చితంగా ఫ్లాగ్ చేస్తుంది. అదనంగా, ఎస్ఎంఎస్ ద్వారా పొందే హానికరమైన లింక్‌లపై కూడా యూజర్లను హెచ్చరిస్తుంది. ఎయిర్‌టెల్ బ్లాక్‌లిస్ట్ చేసిన యూఆర్ఎల్ సెంట్రలైజడ్ డేటాబేస్‌ను రూపొందించింది. అనుమానాస్పద లింక్‌లపై అనుకోకుండా క్లిక్ చేయకుండా వినియోగదారులను హెచ్చరించేలా అత్యాధునిక ఏఐ అల్గారిథమ్ ద్వారా ప్రతి ఎస్ఎంఎస్ రియల్ టైమ్‌లో స్కాన్ చేస్తుంది. దీని పరిష్కారం తరచుగా ఐఎమ్ఈఐ మార్పులు వంటివి కూడా గుర్తించగలదు. సీఈఓ ప్రకారం.. ప్రతిరోజూ 100 మిలియన్ల స్పామ్ కాల్స్, 3 మిలియన్ స్పామ్ ఎస్ఎంఎస్‌లను విజయవంతంగా గుర్తించింది.
Admin
Studio18 News