Studio18 News - టెక్నాలజీ / : టెక్ ప్రియులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం దేశ వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు జనాలు తెల్లవారుజాము నుంచే యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరారు. ముంబై, ఢిల్లీ సహా పలు నగరాలలోని యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు భారీగా క్యూ కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల యాపిల్ సంస్థ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కొత్త చిప్ ఏ18తో వచ్చిన ఈ మొబైల్స్‌లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను యాపిల్ జత చేసింది. చూడగానే ఆకట్టుకునే డిజైన్ వీటి సొంతం. కాగా, ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ. 1,19,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధర రూ. 1,44,900గా సంస్థ నిర్ణయించింది.
Admin
Studio18 News