Monday, 02 December 2024 02:12:03 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Apple Foldable iPhone : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. త్వరలో మడతబెట్టే ఐఫోన్లు వస్తున్నాయి.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ ఎలా ఉండొచ్చుంటే?

Date : 24 July 2024 06:01 PM Views : 74

Studio18 News - టెక్నాలజీ / : Apple Foldable iPhone : ఆపిల్ ఐఫోన్ అభిమానులకు అదిరే న్యూస్.. రాబోయే రోజుల్లో ఐఫోన్లలో కూడా మడతబెట్టే ఫోన్లు రానున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ బట్టి స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చేందుకు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఇతర స్మార్ట్ ఫోన్ దిగ్గజాల్లో సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్, వన్‌ప్లస్, వివో లేదా ఇతర బ్రాండ్లు ఫోల్డుబల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే, ఐఫోన్‌తో అగ్రగామిగా ఉన్న ఆపిల్ ఈ విషయంలో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది.భవిష్యత్తులో ఆపిల్ కూడా సొంత ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకు రానుందా? లేదా అనేదానిపై స్పష్టత లేదు. అసలు మడతబెట్టే ఐఫోన్లను ఎప్పుడు తీసుకువస్తుందనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. నివేదికలను విశ్వసిస్తే.. ఆపిల్ అభిమానులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆపిల్ 2026లో సొంత ఫోల్డబుల్ ఐఫోన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆపిల్ నుంచి ఈ ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్.. శాంసంగ్, గెలాక్సీ ఫ్లిప్ మాదిరిగానే ఫ్లిప్-స్టైల్ డివైజ్‌గా వస్తుందని అంచనా. 2026లో ఐఫోన్ ఫ్లిప్ పేరుతో ఫోల్డబుల్ ఫోన్..? : ఆసియా టుడే ప్రకారం.. కుపెర్టినో-ఆధారిత దిగ్గజం ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తాత్కాలికంగా ఐఫోన్ ఫ్లిప్ అని పేరు పెట్టారట. 2023లో ఈ కొత్త మడతబెట్టే ఐఫోన్ కోసం ఆపిల్ ఇప్పటికే పరిశోధన, అభివృద్ధి దశను ప్రారంభించిందని నివేదిక సూచిస్తుంది. ఆపిల్ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను 2026 విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆపిల్ కొత్త పేటెంట్ గురించి “మన్నికైన ఫోల్డింగ్ డిస్‌ప్లేలతో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు” అనే పేరుతో నివేదికలు బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. మన్నికైన ఫోల్డబుల్ గ్లాస్ డిస్‌ప్లేను రూపొందించడానికి ఆపిల్ ద్వంద్వ విధానాన్ని వెల్లడిస్తుంది. బెండ్ యాక్సెస్ వెంట గ్లాస్ లేయర్ పలచగా ఉండనుంది. అంటే.. కింద పడినప్పుడు ఈ గ్లాస్ పగిలిపోకుండా వంగిపోయేలా ఉంటుంది.నివేదికలను పరిశీలిస్తే : ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌లను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. ఆపిల్ ఐఫోన్ ఫ్లిప్ శాంసంగ్ డిస్‌ప్లే ద్వారా అందించే ఫోల్డబుల్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని అంచనా. అంతేకాదు.. ఆపిల్ ఈ డీల్‌పై సంతకం కూడా చేసిందని సమాచారం. ఐఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. డివైజ్ కొలతలు ఇప్పటికే ఉన్న ఐఫోన మాదిరిగానే ఉంటాయట. ఆపిల్ యూజర్లు ఇష్టపడే సుపరిచితమైన ఫారమ్ ఫ్యాక్టర్‌ను నిర్వహించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని సూచిస్తుంది. అయినప్పటికీ, ఈ ఐఫోన్ డిజైన్ గురించి నిర్దిష్ట వివరాలపై స్పష్టత లేదు. ది ఇన్ఫర్మేషన్ మరో నివేదిక ప్రకారం.. ఆపిల్ డివైజ్ కోసం భాగాలను ఉత్పత్తి చేయడానికి ఆసియాలోని సరఫరాదారులతో కూడా చర్చిస్తోందని, ప్రాజెక్ట్‌కు ఇంటర్నల్ కోడ్ పేరు V68ని కూడా కేటాయించిందని సూచిస్తుంది. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లతో రానుందని, యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత యాక్టివిటీని మెరుగుపరుస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫోల్డబుల్ ఐఫోన్‌తో పాటు, ఆపిల్ కనీసం ఒక ఐఫోన్ మోడల్‌కు కెమెరా అప్‌గ్రేడ్‌పై కూడా పనిచేస్తోంది. ఈ అప్‌గ్రేడ్ యాంత్రిక వ్యవస్థతో ఎపర్చరు పరిమాణాన్ని నియంత్రించడానికి యూజర్లనుఅనుమతిస్తుంది. ఇందులోని ఫీచర్ డెప్త్-ఆఫ్-ఫీల్డ్ ప్రభావాలను ఎనేబుల్ చేస్తుంది. ఆపిల్ చివరికి ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేస్తుందా లేదా అనేదానిపై గ్యారెంటీ లేదు. దీనిపై ఆపిల్ ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :