Studio18 News - టెక్నాలజీ / : WhatsApp Meta AI : వాట్సాప్ మెటా ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి మెటా ఏఐ సపోర్టును విస్తరిస్తోంది. ఇప్పటికే పలు భాషల్లోకి మెటా ఏఐని ప్రవేశపెట్టగా లేటెస్టుగా భారతీయ హిందీ లాంగ్వేజీ సపోర్టును కూడా అందుబాటులోకి తెచ్చింది. మెటా ఏఐ విస్తరణలో భాగంగా భాషపరమైన అడ్డంకులను కూడా ఛేదించవలసి ఉంటుందని మెటా ఇప్పుడే గ్రహించినట్లు కనిపిస్తోంది. అందుకే, మెటా తమ మెటా ఏఐకి మరో 6 కొత్త భాషలను జోడించింది. అందులో వాట్సాప్‌తో సహా సొంత యాప్‌లలో కూడా ఈ లాంగ్వేజీలను ఉపయోగించవచ్చు. ఇప్పుడు హిందీ భాషను అర్థం చేసుకోగలదు.. అలాగే, యూజర్లు అడిగిన ప్రశ్నలకు హిందీలోనే సమాధానాలను ఇవ్వగలదు. అయితే, రాబోయే రోజుల్లో మెటా ఏఐ మరిన్ని ఫీచర్లను తీసుకురానుంది. ఈ కొత్త, రాబోయే మెటా ఏఐ ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం.మెటా ఏఐ ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్ ఫీచర్ : ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో మెటా సీఈఓ మార్క్ జుక్ర్‌బర్గ్ మెటా ఏఐ ఇప్పుడు అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో, పెరూ, కామెరూన్‌లతో సహా 22 దేశాలలో అందుబాటులో ఉందని ప్రకటించారు. కొత్త ప్రాంతాల్లో కాకుండా లాంగ్వేజీ సపోర్టు కూడా అందిస్తోంది. తద్వారా మెటా ఏఐ అసిస్టెంట్‌ని విస్తృతంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులు ఇప్పుడు ఫ్రెంచ్, జర్మన్, హిందీ, హిందీ-రోమనైజ్డ్ స్క్రిప్ట్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్ భాషలలో మెటా ఏఐతో ఇంటరాక్ట్ కావచ్చు. వచ్చే నెలలో యూఎస్, కెనడాలో క్వెస్ట్‌కు కూడా రానుంది. ప్రస్తుతం అనేక యూరోపియన్ భాషలలో మెటా ఏఐ అందుబాటులో ఉండగా, యూరోపియన్ ప్రాంతంలోని వినియోగదారులు ఇప్పటికీ చాట్‌బాట్‌కు యాక్సస్ కలిగి లేనట్లు కనిపిస్తోంది. మెటా ఏఐ చాట్‌బాట్ సెట్టింగ్‌లో అవసరమైన రీసెట్ చేయడం లేదా తొలగించడం వంటి వాటితో సహా వినియోగదారులు ఎప్పుడైనా తమ షొటోలను సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఫొటో ఎడిటింగ్ : మెటా ఏఐ కొత్త ఇమాజిన్ ఎడిటింగ్ ఫీచర్ టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో పాటు ఫొటోలను ఎడిట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. నేచురల్ ఇమేజ్ మానిప్యులేషన్ అందిస్తుంది. మెటా ఏఐ ఇమేజ్ మానిప్యులేషన్ ఫీచర్ ద్వారా వినియోగదారులు టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో ఫొటోలను ఎడిట్ చేయొచ్చు. ఎలిమెంట్‌లను యాడ్ చేయడం లేదా డిలీట్ చేయడం, కలర్ ఎడ్జెస్ట్‌మెంట్, మార్పులు వంటివి ప్రారంభంలో ఇంగ్లీష్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ క్రమంగా అదనపు భాషలకు విస్తరిస్తోంది.
Admin
Studio18 News