Thursday, 05 December 2024 09:59:52 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మీ క్రెడిట్, డెబిట్ కార్డు PIN ఇదేనా? హ్యాక్ చేస్తారు జాగ్రత్త.. సెక్యూరిటీ కోసం ఇవి తప్పక గుర్తుంచుకోండి!

Date : 13 September 2024 04:00 PM Views : 58

Studio18 News - టెక్నాలజీ / : Tech Tips in Telugu : మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఈ కార్డుల పిన్ విషయంలో జర జాగ్రత్త.. కార్డు పిన్ కోడ్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. హ్యాకర్లు ఈ డెబిట్, క్రెడిట్ కార్డు పిన్‌లను ఇట్టే పసిగట్టేస్తారని తెలుసా? అందుకే, తరచుగా మీ క్రెడిట్, డెబిట్ కార్డ్ పిన్‌ని మార్చుకోవాలని చెప్పేది.. మీ పిన్‌ను దుర్వినియోగం చేస్తే విలువైన డబ్బును కోల్పోతారు. ప్రతి 3 నెలలకోసారి మీ అన్ని ముఖ్యమైన కార్డ్‌ల పిన్‌ను మారుస్తూ ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి నెలా మీరు అనేక షాపుల్లో మీ పిన్ కోడ్‌ను ఎంటర్ చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ కార్డు పిన్ ద్వారా స్కామర్లు, హ్యాకర్లు డబ్బులను దొంగిలించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డుదారులు తప్పక అప్‌డేట్ కావాలి. కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. డెబిట్, క్రెడిట్ కార్డు పిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రాంగ్ సెక్యూరిటీ పిన్‌ను సెట్ చేసుకోవాలి. ఇలాంటి స్ట్రాంగ్ పిన్ కోడ్‌లను హ్యాకర్లు ఛేదించడం చాలా కష్టం కూడా. అందుకే మీ కార్డుల పిన్ కోడ్ తరచూ మారుస్తు ఉండాలి. సెక్యూరిటీ పిన్ కోసం కొన్ని స్పెషల్ టిప్స్ : * డెబిట్, క్రెడిట్ కార్డ్ పిన్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు.. సాధారణ సెక్యూరిటీ పిన్‌కి చాలా భిన్నంగా ఉండాలని గుర్తుంచుకోండి. * మీ పిన్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు.. చాలా స్పష్టంగా కనిపించే సంఖ్యను సెట్ చేయవద్దు. * చాలా మంది 0000 లేదా 1234ని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటారు. అటువంటి పిన్‌లు సులభంగా హ్యాక్ అవుతాయి. * డెబిట్, క్రెడిట్ కార్డ్ పాస్‌వర్డ్ ఎంత యూనిక్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే అంత మంచిది. * మీ సెక్యూరిటీ పిన్ ఎంత ఎక్కువ ఉంటే.. హ్యాకర్లు క్రాక్ చేయడం అంత కష్టం. * మీ పిన్‌ను 6 లేదా 8 అంకెల మధ్య ఉంచాలని సైబర్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. * మీ కార్డ్‌పై మీ సెక్యూరిటీ పిన్‌ను ఎప్పుడూ రాయొద్దు. * మీ వ్యాలెట్‌లోనూ PIN ఉంచవద్దు. ఎందుకంటే హ్యాకర్లు లేదా దొంగల చేతుల్లోకి సులభంగా దొరికిపోతుంది. * మీ కార్డ్, పిన్‌ను సేఫ్‌గా ఉంచండి. ఎవరితోనూ మీ పిన్ షేర్ చేయవద్దు. * రద్దీగా ఉండే ప్రదేశాలలో లేదా మీరు సేఫ్‌గా లేరని భావించే ప్రదేశాలలో ATMలను ఉపయోగించవద్దు. * మీరు మొబైల్ బ్యాంకింగ్‌ని ఉపయోగిస్తుంటే.. అదనపు భద్రత కోసం పిన్ లేదా ఫింగర్‌ఫ్రింట్ అన్‌లాక్‌ (Fingerprint Unlock)ని సెటప్ చేయండి. * మీ కార్డ్ వివరాలు లేదా PIN కోసం అడిగే ఇమెయిల్‌లు లేదా మెసేజ్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. * ఏదైనా సమాచారాన్ని షేర్ చేయడానికి ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్ సరైనదా కాదా? నిర్ధారించుకోండి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :