Saturday, 07 March 2026 08:56:12 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Realme: కొత్త ఫోన్ ఆవిష్కరించిన రియల్‌మీ.. ఫీచర్లు అదుర్స్

Date : 13 September 2024 03:46 PM Views : 272

Studio18 News - టెక్నాలజీ / : గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ భారత్‌లో మరో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇవాళ (శుక్రవారం) రియల్‌మీ పీ2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గతేడాది మార్కెట్‌లోకి తీసుకొచ్చిన పీ సిరీస్‌‌లో కొత్తగా దీనిని జోడించింది. కర్వ్డ్ డిస్‌ప్లే, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అదిరిపోయే బ్యాటరీ కెపాసిటీతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ అనేక ఫీచర్లు ఇటీవలే ఆవిష్కరించిన రియల్‌మీ 13 ప్లస్ 5జీ మాదిరిగానే ఉన్నప్పటికీ.. ప్రాసెసర్‌తో పాటు కొన్ని హార్డ్‌వేర్ మార్పులు ఉన్నాయి. ఈ ఫోన్ లుక్, డిజైన్ ‘రియల్‌మీ నార్జో 70 టర్బో’ను పోలి ఉన్నాయి. ధర ఎంతంటే? రియల్‌మీ పీ2 ప్రో ఫోన్ బూడిద, ఆకుపచ్చ రంగులలో కనిపిస్తుంది. ఈ ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. 8జీ ర్యామ్ + 128జీబీ వేరియెంట్ ఫోన్ ధర రూ.21,999గా ఉంది. ఇక12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియెంట్ ధర రూ. 24,999గా, 12జీబీ ర్యామ్ + 512జీబీ మోడల్ ఫోన్ రేటు రూ.27,999గా ఉన్నాయి. బేసిక్ మోడల్‌పై రూ.2000, ఇతర మోడళ్లపై రూ.3000 వరకు ఫ్లాట్ తగ్గింపు ఆఫర్లను కంపెనీ అందిస్తోంది. అయితే ఈ తగ్గింపు ఆఫర్ దీపావళి పండగ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటల ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌పై అమ్మకాలు మొదలవుతాయి. ఫోన్ ఫీచర్లు ఇవే.. రియల్‌మీ పీ2 ప్రో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14, 2000 నిట్‌ల బ్రైట్‌నెస్, 6.7-అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్ 120హెట్జ్, ప్రత్యేకమైన గొరిల్లా గ్లాస్‌తో ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సెకండరీ డ్యుయెల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32ఎంపీల కెమెరాను కంపెనీ అందించింది. బ్యాటరీ సామర్థ్యం 5,200 ఎంఏహెచ్‌గా, 80వాట్స్ యూఎస్‌బీ టైప్-సీ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ ఫీచర్లు ఉన్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :