Saturday, 24 January 2026 02:37:22 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Jio: జియో నుంచి 'ప్రైమా' సిరీస్‌లో సరికొత్త ఫీచర్ ఫోన్

Date : 11 September 2024 12:50 PM Views : 220

Studio18 News - టెక్నాలజీ / : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజాగా కొత్త ఫోన్‌‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. గత ఏడాది లాంచ్ చేసిన జియో ప్రైమా మొబైల్‌కు కొనసాగింపుగా జియో ప్రైమా 2 పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. పాత ఫోన్‌కు మరిన్ని మెరుగైన ఫీచర్లను జోడించింది. తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన జియో ప్రైమా 2 మొబైల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి..? దీని ధర ఎంత..? తదితర పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిస్తే... జియో ఫ్రైమా 2 ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్ ధరను రూ.2,799గా నిర్ణయించారు. బ్లూ కలర్‌లో ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిన్న ఫీచర్ ఫోన్‌లో ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. జియో ప్రైమా 2 మొబైల్ లో 2.4 అంగుళాలతో కూడిన కర్వడ్ స్క్రీన్ ను అందించారు. కీ ప్యాడ్‌తో పని చేసే ఈ మొబైల్‌‌లో క్వాల్ కామ్ చిప్ సెట్ ప్రొసెసర్‌ను అందించారు. ఫోన్ లో 2000 ఎంఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. ఈ మొబైల్ సింగిల్ న్యానో సిమ్‌ను సపోర్టు చేస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ వంటి యాడ్స్‌కు ఈ మొబైల్ సపోర్టు చేస్తుంది. వాట్సాప్, ఫేస్ బుక్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. 4జీ కనెక్టివిటీకి సపోర్టు చేసే ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను ఇచ్చారు. ఈ మొబైల్‌లో యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయం ఏర్పాటు చేయడం మరో విశేషంగా పేర్కొంటున్నారు. ఈ మొబైల్ 23 భాషలకు సపోర్టు చేస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :