Studio18 News - టెక్నాలజీ / : Apple Glowtime Launch Event : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ 2024 ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌లను సెప్టెంబర్ 9న (సోమవారం) గ్లోటైమ్ ఈవెంట్‌లో లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్ రాత్రి 10.30కి ప్రారంభం కానుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయం ఆపిల్ పార్కులో నిర్వహించనుంది. లాంచ్ ఈవెంట్ ఆపిల్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో కంపెనీ ఇండియా వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ ఈవెంట్‌లో ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ సహా 4 కొత్త ఐఫోన్‌లను ప్రకటించనుంది. ఐఫోన్‌లతో పాటు, ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4లను కూడా లాంచ్ చేస్తుంది. అయితే, ఈ ఈవెంట్‌లో ఐఫోన్‌లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రవేశపెట్టనుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో గ్లోటైమ్ ఈవెంట్ : 2024 వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (WWDC)లో ఆపిల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై కంపెనీ టేక్ ప్రకటించింది. ఆ సమయంలో కొత్త ఐఫోన్‌లో ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ “ఉచితంగా అందుబాటులో ఉంటుందని” కంపెనీ ప్రకటించింది. ఐఫోన్ 16 సిరీస్ కాకుండా ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్, ఎమ్1, ఇతర ఐపాడ్స్, మ్యాక్స్ సిస్టమ్‌లలో కూడా మార్పులు చేసింది. అంతేకాదు.. ఆపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆపిల్ సిరిలో గణనీయమైన మార్పులు చేస్తోంది. ఏఐ ఐఫోన్‌లలో కొత్త ఆపిల్ ఇంటిలిజెన్స్‌తో, ఆపిల్ ఫోన్‌లలో ఓపెన్ఏఐ చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్‌ను కూడా చూడొచ్చు. చాట్ జీపీటీ-4o సపోర్టు, గూగుల్, అంత్రాపిక్, ఇతర ఏఐ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి చాట్‌బాట్‌లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్లు ఏమి ఉండొచ్చు? : ఆపిల్ ఐఫోన్ 16 లైనప్‌లో మొత్తం 4 మోడళ్లను అందించనుంది. అందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ఉంటాయి. ప్రతి ఐఫోన్ కొత్త ఎ18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. బోర్డు అంతటా హై పర్ఫార్మెన్స్ సామర్థ్యాలను అందిస్తుంది. అయితే, ప్రతి మోడల్ సొంత ప్రత్యేక ఫీచర్లతో రానున్నాయి. ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 11 నుంచి డిజైన్ ఎలిమెంట్‌లను తీసుకురానుంది. నిలువుగా ఉండే కెమెరాలు క్యాప్సూల్-ఆకారపు మాడ్యూల్‌లో ఉంటాయి. ఇటీవలి వెర్షన్లలో కనిపించే వైట్, బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. కెమెరా సిస్టమ్ ఐఫోన్ 15 మాదిరిగానే ఉండనుంది. 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. రోజువారీ యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ భారీ స్క్రీన్‌లను ఇష్టపడే వారి కోసం రూపొందించింది. స్ట్రీమింగ్, గేమింగ్‌కు సరైనది. కెమెరా సిస్టమ్‌తో సహా స్టాండర్డ్ మోడల్‌లోని అనేక ఫీచర్లను షేర్ చేస్తోంది. భారీ డిస్‌ప్లేతో ప్రత్యేకంగా నిలుస్తుంది. గత ఏడాది మోడల్‌తో పోలిస్తే.. బ్యాటరీ సామర్థ్యం సుమారు 9 శాతం తగ్గుతుందని అంచనా. ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ కెమెరా అప్‌గ్రేడ్‌తో సహా లైనప్‌లో అత్యంత అధునాతన ఫీచర్లను అందిస్తున్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ 12ఎంపీ నుంచి 48ఎంపీ వరకు పెరగనుంది. మెరుగైన ఫొటో క్వాలిటీని అందిస్తోంది. అదనంగా, బ్యాటరీ లైఫ్ గణనీయంగా మెరుగుపడుతుందని అంచనా. కొత్త “డెసర్ట్ టైటానియం” కలర్ ఈ ప్రీమియం మోడళ్లకు అడ్వాన్స్ టచ్‌ని అందిస్తుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4 : ఆపిల్ వాచ్ సిరీస్ 10 ఈసారి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే.. స్మార్ట్‌వాచ్ 10వ వార్షికోత్సవాన్ని కూడా సూచిస్తుంది. భారీ డిస్‌ప్లే సైజులో సన్నగా ఉండే డిజైన్‌ను కలిగి ఉండవచ్చు. ప్రస్తుత 41ఎమ్ఎమ్ మోడల్ 45ఎమ్ఎమ్ విస్తరించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, 45ఎమ్ఎమ్ వెర్షన్ నుంచి 49ఎమ్ఎమ్ పెరగవచ్చు. వినియోగదారులకు మరింత స్క్రీన్ స్పేస్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఆపిల్ వాచ్ హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లు, గణనీయమైన అప్‌గ్రేడ్‌లను చూసే అవకాశం ఉంది. బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, స్లీప్ అప్నియా డిటెక్షన్ కాంటాక్టు వంటి ఫీచర్లు ఉంటాయి. ఆపిల్ వాచ్‌తో పాటు, ఆపిల్ ఎయిర్ పాడ్స్ లైనప్‌ని ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్‌తో రిఫ్రెష్ చేయవచ్చని అంచనా. ఈ కొత్త ఇయర్‌బడ్‌లు షార్ట్ స్టెమ్‌తో ఆధునిక డిజైన్‌ను అందించాలని భావిస్తున్నారు. ఎయిర్‌పాడ్స్ 4 యూఎస్‌బీ-సి ఛార్జింగ్‌కు మారవచ్చు. ఇటీవలి ఐప్యాడ్, మ్యాక్‌బుక్ మోడళ్లలో చూసినట్లుగా ఈ యూనివర్సల్ స్టాండర్డ్‌కి ఆపిల్ అనుగుణంగా ఉంటుంది. ఎయిర్‌ప్యాడ్స్ 4 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), గతంలో ఎయిర్‌పాడ్స్ ప్రోకి ప్రత్యేకమైన ఫీచర్. అదే నిజమైతే, యూజర్లకు మరింత సరసమైన ధరలో ప్రీమియం ఆడియో ఫీచర్‌లను అందించనుంది. మొత్తంమీద, ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్ ప్యాడ్స్ 4 రెండూ డిజైన్‌లో మార్పు ఉంటుందని భావిస్తున్నారు.
Admin
Studio18 News