Monday, 02 December 2024 12:36:48 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Infinix Hot 50 5G : భలే ఉంది భయ్యా.. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ అదుర్స్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Date : 05 September 2024 05:13 PM Views : 98

Studio18 News - టెక్నాలజీ / : Infinix Hot 50 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఇన్పినిక్స్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ ఏడాదిలో ఫస్ట్ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది. అదే.. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్. కంపెనీ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరల విభాగంలో 7.8ఎమ్ఎమ్ స్లిమ్ డిజైన్, సోనీ 48ఎంపీ ఐఎమ్ఎక్స్582 కెమెరా, టీయూవీ ఎస్‌‌యూడీ సర్టిఫికేషన్ ద్వారా 5 ఏళ్ల మృదువైన పర్ఫార్మెన్స్ కలిగి ఉంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ, మీడియాటెక్ డైమన్షిటీ 6300 5జీ చిప్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్స్‌లోకి ప్రవేశించే ముందు ధర, ఇతర వివరాలను ఓసారి పరిశీలిద్దాం. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ధర ఎంతంటే? : ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999కు పొందవచ్చు. ఈ ఫోన్ మొత్తం 4జీబీ, 8జీబీ అనే రెండు మెమరీ వేరియంట్లలో వస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ.9,999, 8జీబీ వేరియంట్ ధర రూ.10,999కు అందిస్తుంది. సెప్టెంబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ ప్రారంభం కానుంది. ఇన్ఫినిక్స్ ధరను తగ్గించే మరిన్ని బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. మీరు ఫోన్ రూ.8,549కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం స్లీక్ బ్లాక్, వైబ్రాంట్ బ్లూ, సేజ్ గ్రీన్, డ్రీమీ పర్పుల్ అనే 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు : ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ 7.8ఎమ్ఎమ్ మందంతో స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ కర్వడ్ ఎడ్జ్‌లతో రెక్టాంగులర్ మాడ్యూల్‌పై దువా-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. డ్రీమీ పర్పుల్ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. మొత్తం 4 కలర్లలో మిగిలిన మూడింటిలో బ్రైట్‌నెస్ బ్యాక్ ప్యానెల్ ఉంది. లేకపోతే, బ్యాక్ ప్యానెల్ దిగువ భాగంలో ఇన్ఫినిక్స్ 5జీ బ్రాండ్‌తో క్లీన్‌గా ఉంటుంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 మాదిరిగా ఇంటరాక్టివ్ యూఐతో డైనమిక్ బార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ, 128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4జీబీ, 8జీబీ అనే రెండు మెమరీ వేరియంట్లలో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఎక్స్ఓఎస్ 14పై రన్ అవుతుంది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ ఫోన్ 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది. ఏఐ ఛార్జ్ ప్రొటెక్షన్‌తో కూడా వస్తుంది. ఏఐ ఛార్జ్ ప్రొటెక్షన్ బ్యాటరీ హెల్త్, ఛార్జింగ్ ప్యాటర్న్‌ని ట్రాక్ చేసేందుకు వినియోగించవచ్చు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 48ఎంపీ డ్యూయల్-రియర్ కెమెరాను కలిగి ఉంది. 12 కెమెరా మోడ్‌లను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఆసక్తికరంగా, ఫ్రంట్, బ్యాక్ కెమెరాలకు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :