Studio18 News - టెక్నాలజీ / : Brain Cancer Risk : ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రతిఒక్కరి జీవితంలో భాగమైపోయింది. అదో ఫోన్ ఇప్పుడు నిత్యవసరంగా మారింది. మరికొందరికి అదో వ్యసనంగా మారిపోయింది. మొబైల్ ఫోన్ కలిగిన వారు రోజులో కనీసం ఒక క్షణం కూడా ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ మొబైల్ ఫోన్లకు బాగా అడిక్ట్ అయిపోయారనే చెప్పాలి. అంతగా మనిషి మనుగడకు ఫోన్ జీవనాధారంగా మారింది. మొబైల్ ఫోన్లలోని రేడియేషన్ కారణంగా బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు ఉందంటూ గతంలో అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, తాజాగా కొత్త అధ్యయనంలో అలాంటిది ఏమి ఉండదని తేల్చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ అధ్యయనాన్ని సమర్థించింది. ఆరోగ్య సంస్థ నియమించిన కొత్త రివ్యూలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని మెదడు క్యాన్సర్ ప్రమాదానికి గురిచేసే ఆధారాలు ఏవీ గుర్తించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనలను విశ్లేషించిన ఈ అధ్యయనంలో మొబైల్ ఫోన్‌లు, వైర్‌లెస్ టెక్నాలజీ విస్తృత వినియోగంతో బ్రెయిన్ క్యాన్సర్ ముప్పును పెంచదని తేల్చేశారు పరిశోధకులు. ఫోన్ల వాడకంతో క్యాన్సర్ ముప్పు : గత కొన్ని దశాబ్దాలుగా మొబైల్ ఫోన్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఫోన్ల వాడకంతో బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కనుగొనలేదు. ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించే యూజర్లు దశాబ్ద కాలంగా వాటిని ఉపయోగిస్తున్న వారు కూడా ఇందులో ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. ఈ మేరకు ఇటీవల ప్రచురించిన రివ్యూలో 1994, 2022 మధ్య నిర్వహించిన 63 అధ్యయనాలను పరిశీలించింది. ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రేడియేషన్ ప్రొటెక్షన్ అథారిటీ నుంచి నిపుణులతో సహా 10 దేశాల నుంచి 11 మంది పరిశోధకులు ఈ పరిశోధనను నిర్వహించారు. మొబైల్ ఫోన్‌లు, అలాగే టీవీలు, బేబీ మానిటర్లు, రాడార్ వంటి ఇతర డివైజ్‌లను ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ప్రభావాలపై రివ్యూ చేశారు. ప్రొఫెసర్ మార్క్ ఎల్వుడ్, అధ్యయనం సహ-రచయిత, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ యూనివర్శిటీ క్యాన్సర్ ఎపిడెమియాలజీలో నిపుణుడు ఇదే విషయాన్ని వెల్లడించారు. బ్రెయిన్ క్యాన్సర్ ముప్పును పెంచే ఆధారాలేమి కనిపించలేదని స్పష్టం చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు మెదడు క్యాన్సర్‌తో పాటు పిట్యూటరీ గ్రంధి, లాలాజల గ్రంథులు, లుకేమియా క్యాన్సర్‌లతో సహా వివిధ రకాల క్యాన్సర్‌లను ఈ అధ్యయనం పరిశీలించింది. ఇందులో మొబైల్ ఫోన్ వినియోగం, బేస్ స్టేషన్లు, ట్రాన్స్‌మిటర్‌లు, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌కు వృత్తిపరమైన బహిర్గతం వంటి వాటితో సంబంధం ఉన్న నష్టాలను పరిగణించారు. ఇతర క్యాన్సర్ రకాలు ప్రత్యేక నివేదికలో వెల్లడించనున్నారు. మొబైల్ ఫోన్ వినియోగం, క్యాన్సర్ మధ్య ఎలాంటి కచ్చితమైన సంబంధాన్ని కనుగొనలేదని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ, ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్‌లు విడుదల చేసే రేడియేషన్ నుంచి హానికరమైన ఆరోగ్య ప్రభావాలకు కచ్చితమైన ఆధారాలు లేవని గతంలో పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా అనేది పర్యవేక్షించడానికి పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) మొబైల్ ఫోన్ రేడియేషన్‌ను “కార్సినోజెనిక్” లేదా క్లాస్ 2బీగా వర్గీకరిస్తుంది. 2011లో చివరి అసెస్‌మెంట్ నుంచి కొత్త డేటా ఇచ్చింది. ఈ వర్గీకరణను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఏజెన్సీ సలహా బృందం సిఫార్సు చేసింది. డబ్ల్యూహెచ్ఓ రివీల్ చేసిన అధ్యయనానికి సంబంధించి సమాచారం వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదల చేస్తుందని భావిస్తున్నారు. మొబైల్ ఫోన్ వినియోగంతో రాబోయే రోజుల్లో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రభావం ఎంతవరకు ప్రభావం ఉంటుందో లేదో స్సష్టత రానుంది.
Admin
Studio18 News