Studio18 News - టెక్నాలజీ / : Tech Tips in Telugu : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సెర్చ్ (Google Search)లో ఏదో ఒక సమాచారం కోసం సెర్చ్ చేస్తుంటారు. అలాంటి సమయాల్లో మీ వ్యక్తిగత డేటా (Results About You) కూడా గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపిస్తే ఏం చేస్తారు.. మీరు గూగుల్ సెర్చ్ పేజీలో మీ పేరును సెర్చ్ చేసినప్పుడు సోషల్ మీడియా ప్రొఫైల్‌లు, ఫొటోలు, వ్యాపారం వంటి అనేక స్టోరీలకు సంబంధించిన రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. వ్యాపారపరమైన సమాచారం అయితే పర్వాలేదు.. కానీ, మీ వ్యక్తిగత డేటా అందరికీ అందుబాటులో ఉంటే ప్రైవసీ పరంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఈ పర్సనల్ డేటాను గూగుల్‌లో ఇండెక్స్ అయితే మళ్లీ రిమూవ్ చేయలేమా అంటే.. రిమూవ్ చేయొచ్చు.. సెర్చ్ రిజల్ట్స్ నుంచి హాని కలిగించే కంటెంట్‌ను డిలీట్ చేయడానికి గూగుల్ మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ వ్యక్తిగత డేటాలో ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రస్ వంటి వివరాలను సులభంగా డిలీట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం భారత్‌లో ప్రత్యేక టూల్ అందుబాటులో లేనప్పటికీ.. గూగుల్ ప్రొడక్టులు, సర్వీసుల నుంచి చట్టవిరుద్ధమైన కంటెంట్ గురించి రిపోర్టు చేయడానికి గూగుల్ భారతీయ యూజర్లను అనుమతిస్తుంది. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో మీ పర్సనల్ కాంటాక్టు డేటాను ఎలా గుర్తించాలంటే? : 1. ముందుగా గూగుల్ హోం పేజీని ఓపెన్ చేయండి. 2. గూగుల్ యాప్‌లో, (Google) యాప్‌కి లాగిన్ చేయండి. 3. మీ గూగుల్ అకౌంట్ అవతార్ (ప్రొఫైల్)ను క్లిక్ చేసి మెనుని ఓపెన్ చేసి ‘Results About You‘ ఆప్షన్ ఎంచుకోండి. 4. మొబైల్ వెబ్ లేదా డెస్క్‌టాప్‌లో, యూజర్లు తమ గూగుల్ అకౌంట్లకు లాగిన్ చేయవచ్చు, గూగుల్ అకౌంట్ అవతార్ క్లిక్ చేయండి. 5. మీ అకౌంట్లో Manage Your Google Account > Data & privacy అనే ఆప్షన్ ఎంచుకోండి. 6. ‘History settings’లో My Activity > Other activity ఎంచుకోండి. 7. ‘Results about you’ సెక్షన్‌కు కిందికి స్క్రోల్ చేయండి. ‘Manage results about you’ ఆప్షన్ ఎంచుకోండి. 8. Get started or Settings ఎంచుకోండి. 9. సెర్చ్ రిజల్ట్స్‌లో మీ పేరు, కాంటాక్టు ఇన్ఫో ఎంటర్ చేయండి. ఈ డేటాను చూపే సెర్చ్ రిజల్ట్స్ కోసం చెక్ చేయడానికి గూగుల్ ఇప్పుడు ఈ డేటాను ఉపయోగిస్తుంది. సెర్చ్ రిజల్ట్స్ ద్వారా మీ డేటా సరిపోలితే అప్‌డేట్ పొందడానికి నోటిఫికేషన్‌ను ఎనేబుల్ చేయండి. Review the Search Results : మీ బ్రౌజర్‌లో నోటిఫికేషన్‌లు ఆన్‌లో ఉన్నట్లయితే.. ఏవైనా సెర్చ్ రిజల్ట్స్ మీ పేరు, వ్యక్తిగత కాంటాక్టు ఇన్ఫో సరిపోలితే మీకు కొన్ని గంటల్లో నోటిఫికేషన్ వస్తుంది. మీరు ‘Results about you’ పేజీ నుంచి కూడా నేరుగా చెక్ చేయవచ్చు. మీ రిజల్ట్స్ చూసేందుకు ‘Results about you’ పేజీ నుంచి ‘Results to review’ ట్యాబ్‌కు వెళ్లండి. మీరు సెర్చ్ రిజల్ట్స్ ఎంచుకున్నప్పుడు, వెబ్‌సైట్ లేదా దానిలోని కాంటాక్టు ఇన్ఫో వంటి వాటి గురించి మరింత తెలుసుకోవచ్చు. Request removal of the results : 1. మీరు పర్సనల్ డేటాను చూస్తే.. ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటే.. సెర్చ్ రిజల్ట్స్ నుంచి తొలగించమని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. 2. ఒకటి కన్నా ఎక్కువ రిజల్ట్స్ తొలగించడానికి ప్రతి రిజల్ట్ పక్కన ఉన్న (Request to Remove) చెక్‌బాక్స్‌ని ఎంచుకోండి. 3. ఒక రిజల్ట్స్ తొలగించడానికి విస్తరించడానికి (Request to Remove) రిజల్ట్స్ ఎంచుకోండి. 4. మీరు డేటా రిమూవ్ రిక్వెస్ట్ వద్దనకుంటే.. మీరు ‘Mark as reviewed’ అనే ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. 5. గూగుల్ కొన్ని సెర్చ్ రిజల్ట్స్ విలువైనదిగా పరిగణిస్తుందని గమనించాలి. ఇందులో ప్రభుత్వ లేదా విద్యా వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ న్యూస్‌పేపర్స్ లేదా బిజినెస్ వెబ్‌సైట్‌లు ఉండవచ్చు. ఇలాంటి వెబ్‌సైట్ నుంచి సెర్చ్ రిజల్ట్స్ వచ్చినట్లయితే.. మీకు ‘Remove result’ అనే ఆప్షన్ కనిపించదు. 6. ‘removal request’ కన్ఫామ్ చేయడం రిక్వెస్ట్ రివ్యూ స్టేటస్ వంటి అప్‌డేట్స్ ఈ-మెయిల్ ద్వారా పొందవచ్చు. మీరు ‘Removal requests’ కింద ‘Results about you’ నుంచి ఎప్పుడైనా రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయవచ్చు. గూగుల్ సెర్చ్ ఉపయోగించినప్పుడు రిజల్ట్స్ ఇలా డిలీట్ చేయండి : 1. వినియోగదారులు వ్యక్తిగత డేటాకు సంబంధించిన URL కలిగి ఉంటే గూగుల్ సెర్చ్‌లో రిపోర్టు చేయొచ్చు. 2. గూగుల్ సెర్చ్‌లో మీ పేరు కోసం సెర్చ్ చేయండి. 3. ‘About this result’ ప్యానెల్ ఓపెన్ చేసి రిజల్ట్స్ వద్ద More (Three Dots) క్లిక్ చేయండి. 4. వ్యక్తిగత కాంటాక్టు ఇన్ఫోలో (It shows my personal contact info)లో Remove result ఆప్షన్ ఎంచుకోండి. 5. reporting flow ద్వారా వెళ్ళండి. 6. మీ ‘request‘ సమర్పించండి. 7. మీ రిక్వెస్ట్‌ను Submit చేసిన తర్వాత (I’m done) ఎంచుకోండి.
Admin
Studio18 News