Studio18 News - టెక్నాలజీ / : Vivo T3 Pro 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. వివో కొత్త టీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ వివో టీ3 ప్రో 5జీ ఆగస్టు 27న లాంచ్ చేయనుంది. ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన వివో టీ3 5జీ తర్వాత వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వివో టీ3 ప్రో 5జీ ఫోన్ జాబితా అయింది. ప్రత్యేక మైక్రోసైట్ సైట్‌ను కలిగి ఉంది. ఈ సైట్ ప్రాసెసర్ నుంచి కెమెరా వరకు ప్రతిదీ వెల్లడిస్తోంది. వివో టీ3ప్రో 5జీ గురించి ఇప్పటికే తెలిసిన ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం. వివో టీ3 ప్రో 5జీ వెరిఫైడ్ స్పెషిఫికేషన్లు (అంచనా) : స్పెషల్ మైక్రోసైట్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో టీ3 ప్రో 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వివో టీ3 ప్రో 5జీ బ్యాక్ లెదర్ ఎండ్, మెటాలిక్ ఫ్రేమ్‌తో వస్తుంది. బ్యాక్ ప్యానెల్ చదరపు కెమెరా మాడ్యూల్‌ను కూడా హోస్ట్ చేస్తుంది. వివో 7.49 మందంతో “సెగ్మెంట్ అత్యంత సన్నని వంగిన ఫోన్” అని పేర్కొంది. వివో టీ3 ప్రో ఐక్యూ జెడ్9ఎస్ ప్రోకి సమానమైన డిజైన్‌ను కలిగి ఉండటం గమనార్హం. స్మార్ట్‌ఫోన్ రెండు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది. సాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలిగి ఉంది. వివో కూడా వివో టీ3 ప్రో స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌ను కలిగి ఉంటుందని ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ “సెగ్మెంట్ ఫాస్ట్ కర్వడ్ ఫోన్” అని పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ 80డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీని అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో టీ3 ప్రో 8ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరాతో 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా. వివో టీ3 ప్రో స్పెషిఫికేషన్లు : కెమెరా స్పెషిఫికేషన్లలో ఫ్రంట్ కెమెరా వివరాలు ఇంకా తెలియవు. వివో టీ3 ప్రో ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ లెన్స్‌ను కలిగి ఉంటుందని పుకారు ఉంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో విస్తరించుకునే ఆప్షన్ వస్తుందని భావిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ పరంగా, రాబోయే వివో మొబైల్ ఫన్‌టచ్ ఓఎస్ 14ని కలిగి ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. వివో టీ3 ప్రో భారత్ ధర (అంచనా) : వివో టీ3 ప్రో 5జీ ఫోన్ గతంలో లాంచ్ అయిన వివో టీ3 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్. వివో టీ3 5జీ ప్రారంభ ధర రూ. 19,999కు పొందవచ్చు. వివో టీ3 ప్రో 5జీ ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఊహాగానాల ప్రకారం.. వివో టీ3 ప్రో 5జీ మోడల్ రూ. 30వేల ధర విభాగంలో ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 26వేల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, కచ్చితమైన ధర ఆగస్ట్ 27 లాంచ్ తర్వాత మాత్రమే రివీల్ చేయనుంది.
Admin
Studio18 News