Thursday, 05 December 2024 08:26:37 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Reliance Jio: జియో యూజర్లకు కంపెనీ అలర్ట్.. అలాంటి కాల్స్, మెసేజులు నమ్మొద్దని హెచ్చరిక

Date : 26 August 2024 11:35 AM Views : 60

Studio18 News - టెక్నాలజీ / : మోసాలకు అలవాటైన కేటుగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేసేందుకు మోసగాళ్లు జిత్తులమారి మార్గాలను వెతుకుతున్నారు. టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతినిధులమంటూ వ్యక్తిగత సమాచారాన్ని కోరుతున్న కొందరు కేటుగాళ్ల వ్యవహారం తాజాగా బయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన రిలయన్స్ జియో స్వయంగా కస్టమర్లను అప్రమత్తం చేసింది. జియో పేరిట జనాలను మోసగిస్తున్నారని, మోసగాళ్లు జియో ప్రతినిధులుగా నటిస్తూ సున్నిత సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ తరహా సైబర్ మోసాలకు సంబంధించి నమోదైన కేసులు తమ దృష్టికి వచ్చాయంటూ కస్టమర్లను జియో అప్రమత్తం చేసింది. ఇలా నమ్మిస్తున్నారు.. కేటుగాళ్లు పాన్‌ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, ఓటీపీ, సిమ్ వంటి వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్‌ చాట్‌, ఫోన్ కాల్‌లు, మెసేజులు, ఈ-మెయిల్స్‌తో పాటు ఇతర మార్గాల్లో కస్టమర్లను సంప్రదిస్తున్నారు. జియో ప్రతినిధులుగా నమ్మించి వివరాలు అడుగుతున్నారని జియో పేర్కొంది. కోరిన వివరాలు అందించకపోతే సిమ్ కార్డ్ బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక థర్డ్-పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారని, తద్వారా మొబైల్, కంప్యూటర్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని పొందుతున్నారని జియో అలర్ట్ చేసింది. థర్డ్-పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ-మెయిల్ ద్వారా వచ్చిన లింక్‌లపై క్లిక్ చేయమని కస్టమర్లను కోరబోమని జియో పేర్కొంది. కాగా సిమ్‌పై ఉండే 20 అంకెల సిమ్ నంబర్‌ను ఎవరితోనూ పంచుకోవద్దని జియో సూచించింది. యాప్‌లు, ఆన్‌లైన్ ఖాతాల పాస్‌వర్డ్‌లు, పిన్‌ నంబర్‌లను మార్చుతూ ఉండడం మంచిదని సూచించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :