Studio18 News - టెక్నాలజీ / : Samsung Galaxy A06 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త A సిరీస్ ఫోన్ వచ్చేసింది. గ్లోబల్ మార్కెట్లో ముందుగా ఆగస్ట్ 16న వియత్నాంలో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. గత మోడల్ ఫోన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎ05 మాదిరిగానే బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ను కలిగి ఉంది. వర్టికల్ పిన్‌స్ట్రిప్డ్ ఎండ్‌తో ఉంటుంది. అయితే, పాత మోడల్‌లా కాకుండా గెలాక్సీ ఎ06 రైట్ ఎడ్జ్ వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌ను కలిగిన కీ ఐలాండ్ బంప్‌తో వస్తుంది. ఈ కీ ఐలాండ్ ఫీచర్ గతంలో గెలాక్సీ ఎ55, గెలాక్సీ ఎ35లో కనిపించింది. శాంసంగ్ గెలాక్సీ ఎ06 ధర : శాంసంగ్ గెలాక్సీ ఎ06 ఫోన్ 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ధర దాదాపు రూ. 10,700, 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర సుమారు రూ. 12,700), ఆగస్ట్ 22 నుంచి వియత్నాంలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందా అనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. వియత్నాంలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 30 మధ్య శాంసంగ్ ఎ06ని కొనుగోలు చేసే కస్టమర్‌లు 25డబ్ల్యూ ఛార్జర్‌ను ఉచితంగా పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎ06 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ ఎ06 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్, ఫ్రంట్ కెమెరా వాటర్‌డ్రాప్-నాచ్‌ని కలిగి ఉంది. ఈ ఫోన్ 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 1టీబీ వరకు విస్తరించవచ్చు. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎ06 ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ6తో వస్తుంది. రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, నాలుగు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందినట్లు నిర్ధారించింది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌ను అమర్చారు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎ06 50ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో 25డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
Admin
Studio18 News