Monday, 17 March 2025 03:56:27 PM
# Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు # DK Aruna: నిన్న రాత్రి మా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు: డీకే అరుణ # Revanth Reddy: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: సీఎం రేవంత్ రెడ్డి # L2E: Empuraan: మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోహన్ లాల్ ఎల్2ఈ: ఎంపురాన్ # KA Paul: రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం అనిపించుకోవడం ఒక అన్నగా బాధ కలిగించింది: కేఏ పాల్ # Alleti Maheshwar Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి # Narendra Modi: మేం శాంతిని కోరుకుంటుంటే... పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ # AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం # AR Rahman: నేనింకా రెహమాన్ భార్యనే... ఆడియో సందేశం వెలువరించిన సైరా బాను # Namrata Shirodkar: విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత # Kalyan Ram: ఆమెను 'అమ్మ' అనే పిలుస్తాను: నందమూరి కల్యాణ్ రామ్ # North Macedonia: నైట్‌క్లబ్‌లో ప్రమాదం.. 59 మంది సజీవ దహనం # Umran Malik: ఐపీఎల్‌కు ముందు కోల్‌కతాకు భారీ ఎదురుదెబ్బ.. పేస్ సెన్సేషన్ అవుట్! # Actor Nithiin: పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నిస్తే నితిన్ రిప్లయ్ ఇదే! # Heat Waves: ఏపీలోని ఈ మండలాల్లో నేడు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు!

Huawei Watch Fit 2 : అమోల్డ్ స్ర్కీన్‌తో హువావే వాచ్ ఫిట్ 2 వచ్చేసింది.. 10 రోజుల బ్యాటరీ లైఫ్.. భారత్‌లో ధర ఎంతంటే?

Date : 07 August 2024 05:33 PM Views : 92

Studio18 News - టెక్నాలజీ / : Huawei Watch Fit 2 : కొత్త స్మార్ట్ వాచ్ చూశారా? అద్భుతమైన అమోల్డ్ స్క్రీన్ డిస్‌ప్లేతో హువావే వాచ్ ఫిట్ 2 వచ్చేసింది. గతంలో హువావే వాచ్ ఫిట్ 2 ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్‌లలో మాత్రమే ఆవిష్కరించింది. కానీ, ఇప్పుడు ఈ కొత్త స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్లోకి కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఆల్వేస్-ఆన్-డిస్ప్లే (AOD) సపోర్ట్‌తో 1.74-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. ప్రెస్-టు-రిలీజ్ ‘లింక్’ డిజైన్‌తో మార్చుకోగలిగిన బెల్ట్‌లతో వస్తుంది. సాధారణ వినియోగంతో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్, ఇండిపెండెంట్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. అనేక హెల్త్-ట్రాకింగ్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. మల్టీ ప్రీసెట్ వర్కౌట్ మోడ్‌లు, క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కూడా కలిగి ఉంది. భారత్‌లో హువావే వాచ్ ఫిట్ 2 ధర, లభ్యత : అమెజాన్‌లో మిడ్ నైట్ బ్లాక్ యాక్టివ్ ఎడిషన్ హువావే వాచ్ ఫిట్ 2 ఫోన్ ధర రూ. 9,998కు పొందవచ్చు. ఇ-కామర్స్ సైట్‌లో ఇతర కలర్ లేదా స్టాప్ ఆప్షన్ల జాబితా అందించడం లేదు. హువావే వాచ్ ఫిట్ 2 గ్లోబల్ వేరియంట్ మూడు వెర్షన్‌లలో అందిస్తోంది. అందులో యాక్టివ్ ఎడిషన్, క్లాసిక్ ఎడిషన్ ఎలిగెంట్ ఎడిషన్ ఉన్నాయి. ఈ వెర్షన్లలో ప్రతి ఒక్కటి స్ట్రాప్, కేస్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. హువావే వాచ్ ఫిట్ 2 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు : హువావే వాచ్ ఫిట్ 2 మోడల్ 336×480 పిక్సెల్స్ రిజల్యూషన్, 336పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో 1.74-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆల్వేస్-ఆన్-డిస్ప్లే (AOD) ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. మల్టీ క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. మీరు వాచ్ ఫేస్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెక్టాంగ్యులర్ వాచ్ కేస్ ప్రెస్-టు-రిలీజ్ ‘లింక్’ డిజైన్, రైట్ ఎడ్జ్ సైడ్ బటన్‌ను కలిగి ఉంది. హువావే వాచ్ ఫిట్ 2 ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2) లెవల్ మానిటర్, అలాగే నిద్ర, ఒత్తిడి స్థాయి ట్రాకర్‌లను కలిగి ఉంది. ఈ సెన్సార్ల నుంచి డేటాను హువావే హెల్త్ యాప్ ద్వారా మానిటరింగ్ చేయొచ్చు. స్మార్ట్ వాచ్ ఏడు ప్రీసెట్ వర్కౌట్ మోడ్‌లతో వస్తుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. హువావే ఫోన్ యాప్‌లోని ప్లే లిస్టుల ద్వారా బ్లూటూత్ కాలింగ్, ఇండిపెండింట్ మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అనుమతిస్తుంది. హువావే వాచ్ ఫిట్ 2 సాధారణ వినియోగంతో గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్, భారీ వినియోగంతో ఏడు రోజుల వరకు అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :