తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు పేర్కొన్నారు. తన కలలను పండించుకోవాలనీ, అలాగే తాను సాధించాల్సిన లక్ష్యాలు ఉన్నాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాజకీయాలంటే తనకు ఏమాత్రం ఆసక్తి లేదు కాబట్టి తాను ఎప్పటికీ వాటిలో అడుగుపెట్టనని హిమాన్షు స్పష్టం చేశారు.