
- నేటితో ముగిసిన మహేందర్ రెడ్డి పదవీకాలం
- 36 ఏళ్లుగా పోలీసు శాఖలో పని చేసిన మహేందర్ రెడ్డి
- ఐదేళ్ల పాటు పోలీస్ బాస్ గా బాధ్యతలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు శాఖకు దిశానిర్దేశం చేసి, శాంతిభద్రతల పర్యవేక్షణకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతో దూరదృష్టితో ముఖ్యమంత్రి పాలిస్తున్నారని ప్రశంసించారు. మోడ్రన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సహకరించారని చెప్పారు. ఐదేళ్ల పాటు డీజీపీగా ఉండే అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఇక టెక్నాలజీ సహాయంతో ఎన్నో కేసులను పరిష్కరించామని మహేదర్ రెడ్డి చెప్పారు. పోలీసులందరూ టెక్నాలజీతో పాటు అప్ డేట్ కావాలని సూచించారు. రానున్న రోజుల్లో డిజిటల్ రూపంలో నేరాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. కొత్త డీజీపీగా బాధ్యతలను చేబడుతున్న అంజనీకుమార్ కు అభినందనలు తెలియజేశారు.