
డా.కె.ఎల్ రావు పార్క్ మరియు భవానిపురం రివర్ ఫ్రంట్ ఆధునీకరణ పనులకు శ్రీకారం.పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి.విజయవాడ నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించాలనే లక్ష్యంగా రూ. 326 లక్షల విజయవాడ నగరపాలక సంస్థ సాదారణ నిధులతో పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చేపట్టిన అభివృద్ధి పనులకు పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కార్పోరేటర్లతో కలసి శంకుస్థాపన నిర్వహించారు.
46వ డివిజన్ నందలి డా.కె.ఎల్ రావు పార్క్ నందు రూ 2 కోట్ల నిధులతో ఆధునీకరణ పనులకు, రూ. 107.50 లక్షలతో సితార జంక్షన్ నందు ల్యాండ్ స్కాపే, హార్డ్ స్కాపే పనులతో పాటుగా సితార జంక్షన్ నుండి గొల్లపూడి బైపాస్ రోడ్ గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి మరియు రూ. 18.50 లక్షల వ్యయంతో 40 వ డివిజన్ కృష్ణానది కట్ట పైన భవానిఘాట్ నందు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులకు ప్రారంభించారు.ఈ సందర్బంలో శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ.2 కోట్ల నిధులతో నేడు డా.కె.ఎల్ రావు పార్క్ నందలి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయటం జరిగిందని, రాబోవు కొద్ది కాలంలో నగర ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవటం జరిగిందని అన్నారు.
గత కొన్ని ఏళ్లగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోనని ఈ పార్క్ మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మేయర్ గారు పార్క్ ఆధునికరించాలనే ఉద్దేశ్యంతో నిధులు కేటాయించుట జరిగిందని పార్క్ నందు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బొట్టింగ్, ఇండోర్ షటిల్ కోర్ట్, స్క్రాట్టింగ్, వాకింగ్ ట్రాక్, పాత్ వే, యోగ ప్లాట్ పామ్, ఓపెన్ జిమ్ మొదలగు వాటిని ఏర్పాటు చేయుటతో పాటుగా మరుగుదొడ్లు మర్మమ్మత్తులు నిర్వహించుట చర్యలు తీసుకోవటం జరిగిందని రాభోవు రోజులలో పశ్చిమ నియోజకవరానికే మనిహరంగా తీర్చిదిద్దుటకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని అన్నారు.