
- ట్విట్టర్ లో చంద్రబాబుపై విజయసాయి విమర్శలు
- స్పందించిన వర్ల రామయ్య
- విజయసాయికి చింత చచ్చినా పులుపు చావలేదని వ్యాఖ్యలు

విజయసాయిరెడ్డి గారూ… మీకు చింత చచ్చినా పులుపు చావలేదు… ఇంకా నిస్సిగ్గుగా చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నారు అని విమర్శించారు. ఫోను పోయిందని మీరాడిన దొంగనాటకం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈడీ వేగం ఇలాగే కొనసాగితే మూడు నెలల్లో తప్పకుండా అరెస్టవుతారు… జైలుకెళతారు అని పేర్కొన్నారు.
అంతకుముందు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ…. కేంద్ర భద్రతా దళాల జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉండి కూడా ఎవరో చంపేస్తారంటూ చలిజ్వరం వచ్చినవాడిలా వణుకుతున్నాడంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. టీడీపీని తెలుగు డ్రామాల పార్టీగా అభివర్ణించిన విజయసాయి… ఇదేమి ఖర్మ బాబు? రాజకీయాల నుంచి రిటైరై దుప్పటి కప్పుకుని పడుకో అంటూ ఎద్దేవా చేశారు.