ఆసక్తిని రేపుతున్న ‘హిట్ 2’ ట్రైలర్!

Spread the love
  • అడివి శేష్ హీరోగా రూపొందిన ‘హిట్ 2’
  • మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
  • కథానాయికగా కనిపించనున్న మీనాక్షి చౌదరి
  • డిసెంబర్ 2వ తేదీన సినిమా రిలీజ్
Hit 2 movie trailer released
అడివి శేష్ హీరోగా ‘హిట్ 2’ సినిమా రూపొందింది. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ ఇది. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని ఈ సినిమాను నిర్మించాడు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శేష్ సరసన నాయికగా మీనాక్షి చౌదరి అలరించనుంది. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ హైదరాబాదులోని ఆర్కే సినీప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించింది. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సంజన అనే ఒక యువతి హత్య కేసును గురించి పోలీస్ ఆఫీసర్ గా హీరో విచారణ జరపడాన్ని ట్రైలర్ లో చూపించారు. ఫైనల్ టచ్ తో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేశారు.

‘మేజర్’ వంటి సూపర్ హిట్ తరువాత శేష్ చేసిన సినిమా కావడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ‘హిట్’ తో మెప్పించిన శైలేశ్ కొలను, కంటెంట్ పరంగాను .. తారాగణం పరంగాను అంతకుమించి అనే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com